ఒకప్పుడు వైద్య విద్య అంటే కేవలం  ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యేది. అప్పట్లో టాలెంట్ ఉన్నా కానీ ఆ వైద్య విద్య చదవాలంటే కనీసం డబ్బులు లేక చాలా మంది ఆగిపోయేవారు. అలాంటి వైద్య విద్య ప్రస్తుతం పేదలకు కూడా అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా టాలెంట్ ఉన్నవారు కాలేజీల్లో సీట్లు సాధించి వైద్యులుగా మారిపోతున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకువచ్చి విద్యార్థులకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి ఈ తరుణంలో ఆంధ్రాకు ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీల్లో మంచి బోధన సౌకర్యాలు ఉండడమే కాకుండా, అదనంగా మరో 60 పీజీ సీట్లను కేంద్ర ప్రభుత్వం అందించింది.. మరి దీనివల్ల లాభమేంటి అనే వివరాలు చూసేద్దాం.. ప్రస్తుత కాలంలో మెడికల్ కళాశాలలు ఎక్కువ ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. అలాంటి ఈ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఎక్కువగా పెరిగిపోతే రాష్ట్రాలు ఎంతో డెవలప్ అవుతాయి.

 ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉండడం వల్ల అందులో  వైద్య విద్యను అందించే ప్రొఫెసర్ల నుంచి మొదలు చిన్న అటెండర్ వరకు ఎన్నో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. దీనికి తోడు మెడికల్ కాలేజీ చుట్టూ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, కిరాణా వర్తక వ్యాపారాలు, తినుబండారాల వ్యాపారాలు, ప్రైవేట్ హాస్టల్స్ ఇలా ఎంతోమంది బ్రతుకుతారు. కామన్ గా మెడికల్ కాలేజ్ అంటేనే హాస్పిటల్స్ లాగానే ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చి రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్లకు కావాల్సినటువంటి ఆహారము, మందులు కూడా అక్కడే అందించవలసి ఉంటుంది. ఇలా ఒక్క మెడికల్ కాలేజీ వల్ల ఇంతమందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చాలా మెడికలు కాలేజీలను తీసుకొచ్చారు. ఇందులో కొన్ని పూర్తయిపోయి ప్రస్తుతం వైద్య విద్య అందుతోంది.మరికొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.

 ప్రస్తుతం జగన్ తీసుకొచ్చినటువంటి 5 మెడికల్ కాలేజీలలో  నేషనల్ మెడికల్ కౌన్సిల్ 60పీజీ సీట్లను కేటాయించింది. ఇందులో మచిలీపట్నానికి 12, నంద్యాలకు 16, విజయనగరానికి 12, రాజమండ్రికి 16, ఏలూరుకి నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ విధంగా జగన్ వల్ల ఇప్పటికే ఐదు కాలేజీల్లో 150 ఎంబిబిఎస్ సీట్లు, 60పీజీ సీట్లు మంజూరవ్వడంతో వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు ఆనంద పడుతున్నారు. ఇదే సమయంలో మిగతా మెడికల్ కాలేజీలు కూడా పూర్తయి ఉంటే మాత్రం మరికొన్ని సీట్లు కేటాయించి ఉండేవారు. దీనివల్ల ఎంతోమందికి వైద్య విద్య అందుబాటులోకి వచ్చేదని నిపుణులు అంటున్నారు. ఇక ఈ విషయం తెలియజేయడంతో వైఎస్సార్సీపీ వాళ్లు ఇదంతా మా జగన్ పుణ్యమే అంటూ మాట్లాడుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: