ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు  జనాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాన్ని బీజేపీ  అధిరోహించిందని చెప్పవచ్చు. మిగిలిన కొద్దికొద్ది స్థానాల్లో ఎర్రజెండా పార్టీలు  బీఎస్పి వంటివి ఉన్నాయి..ఇదిలా నడుస్తున్న సమయంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎక్కడైనా పోటీ ఏర్పడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు ఏకధాటిగా పాలించిన బీఆర్ఎస్ నాయకులు  మూడవసారి దారుణంగా ఓడిపోయారు. దీంతో ఆ పార్టీలో విపరీతమైన చీలికలు వచ్చాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీ పరిస్థితి తయారవ్వబోతోంది. ఇప్పటికే కవిత తిరుగుబాటు చేసి హరీష్ రావు, కేటీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేసింది. ఇదిలా నడుస్తున్న తరుణంలో హరీష్ రావు కొత్త పార్టీ కోసం చూస్తున్నారని, ఇక కవిత మొత్తం బయటకు వచ్చేసి కొత్త పార్టీ పెట్టబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి పై  దారుణంగా విమర్శలు చేశారు.. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు  బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, గొర్రెల పంపిణీ, ధరణి వంటి ఎన్నో పథకాల్లో స్కాములు చేసి  ఉన్నారని అన్నారు. అలా స్కాములు చేసిన వారికి ఏ పథకం చూసినా, మనం మంచి చేద్దామన్న అందులో స్కాంలే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆర్అండ్ బి పరిధిలోని పలు రోడ్లకు హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ లో అభివృద్ధి చేసి రహదారులను అద్దంలా మారుస్తామని వారికి మింగుడు పడడం లేదన్నారు. హ్యామ్ రోడ్లలో పెద్ద స్కాం జరుగుతోందని ఎనిమిది వేల కోట్ల స్కాం జరగబోతుందని తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

దీనిపై స్పందించిన కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  హ్యామ్ రోడ్లపై ఆయన ఇలా అజ్ఞానంగా మాట్లాడం చూస్తే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోందని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు స్కాములు చేశారు కాబట్టి  వాళ్లకు కాంగ్రెస్ చేస్తున్న ప్రతి దాంట్లో స్కాములే కనిపిస్తున్నాయని  విమర్శించారు.. అభివృద్ధిని ఓర్వలేకే పిచ్చిపిచ్చి మాట్లాడుతున్నారని, త్వరలోనే హరీష్ రావు ఆయన దారి ఆయన చూసుకుంటారని సూచించారు. ఈ విధంగా కోమటిరెడ్డి మాట్లాడడంతో మరోసారి ఆయన మాటలు వైరల్ గా మారాయి. మరి హరీష్ రావు నిజంగానే కొత్త పార్టీ పెడతారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: