భారతదేశ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇతర దేశాలపై యుద్ధపు చర్యలు చేయడానికి అస్సలు ముందుకు రాదు. అందుకు ప్రధాన కారణం ఒక దేశం పై యుద్ధాలు చేసినట్లయితే ఆ దేశం ఎంతో క్షీణిస్తుంది. వారికి ఎంతో ఆస్తి నష్టం , ప్రాణ నష్టం జరుగుతుంది. దీని కారణంగా ఒక దేశాన్ని చాలా వరకు బలహీనపరచవచ్చు. కానీ అలా చేసినట్లయితే భారతదేశం తన కీర్తి , ప్రతిష్టలను కోల్పోతుంది అని ఒక దేశాన్ని ఎంతో నష్ట పరిచింది అవుతుంది అని అలా చేయడం అసలు మంచిది కాదు అనే మానవత్వ గుణంతో భారతదేశ ప్రభుత్వం అస్సలు యుద్దాలను ఎంకరేజ్ చేయదు.

అత్యవసర పరిస్థితుల్లో ఎదుటి దేశం కనుక మనపై దాడి చేసినట్లయితే దానికి ప్రతిఘటన చర్యగా మాత్రమే వారిపై దాడి చేస్తూ ఉంటుంది. కొంత కాలం క్రితం కూడా పాకిస్తాన్ మొదట భారతదేశంపై దాడి చేసింది. దానికి చర్యగా మాత్రమే భారత్ , పాకిస్తాన్ పై దాడి చేసింది. కేవలం ప్రతి చర్యతోనే పాకిస్తాన్ ఎంతో పెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ కూడా పాకిస్థాన్ లానే ప్రవర్తిస్తూ వస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం యునెస్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ ను పరిపాలిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇతను బంగ్లాదేశ్ సైన్యాన్ని అడ్డు పెట్టుకొని భారత్ పై పెద్ద స్థాయిలో కుట్ర చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా యూనస్ అనే వ్యక్తి అస్సాం మరియు ఈశాన్య రాష్ట్రాలను తో కలిసిన బంగ్లాదేశ్ మ్యాప్ ను రెడీ చేసి దానిని పాకిస్తాన్ చీప్ కి ఇచ్చి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాడు.

ఇది మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలలో కూడా బంగ్లాదేశ్ , భారత్ పై కుట్ర దిశగా చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీనితో అనేకమంది భారతీయులు భారత్ కనుక అనుకున్నట్లయితే బంగ్లాదేశ్ ను కొన్ని గంటల్లోనే వణికిస్తోంది. కానీ భారత్ అలా చేయకుండా ఎంతో ఓపికగా వ్యవహరిస్తూ వస్తుంది. దానిని అలుసుగా బంగ్లాదేశ్ తీసుకొవద్దు. దానిని బంగ్లాదేశ్ గనుక అలుసుగా తీసుకున్నట్లయితే బంగ్లాదేశ్ , భారత్ దాడికి పెద్ద స్థాయిలో నష్టపోతుంది అని అనేక మంది భారతీయులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bn