తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఆయన ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడం కోసం ఎంతో కష్టపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. అలాంటి కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించారు. నిజానికి ఆయన రాజకీయం ముందు తెలంగాణలో ఏ లీడరైనా  తేలిపోవాల్సిందే. కింది స్థాయి నుంచి అన్ని చూసుకుంటూ చివరికి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అంతటి ఘనుడిని కూడా ఓడించిన వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే.. కేసీఆర్ చరిష్మా ముందు రేవంత్ రెడ్డి తక్కువ అయినా కానీ ఆయనను ఓడించి చాలా ఫేమస్ అయ్యాడు. చివరికి తెలంగాణ రెండవ సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచాడు.. అలాంటి రేవంత్ రెడ్డిని,  కేటీఆర్ పడగొట్టాలని చూసినా ఆయనకు సాధ్యం కావడం లేదు.. అసలు కేటీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా రేవంత్ రెడ్డి  కూడా కిందిస్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సీఎం అయ్యారు. 

కానీ కేటీఆర్ మాత్రం డైరెక్టుగా ఎమ్మెల్యే, మంత్రి పదవిని పొందాడు. అది కూడా తండ్రి అండదండలతో అనే టాక్ నడుస్తోంది. అయితే కేసీఆర్ మొదటిసారి సీఎం అయినప్పుడు కేటీఆర్ చాలా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. రెండవసారి కేసీఆర్ ఎప్పుడైతే సీఎం సీటు అధిరోహించారో అప్పటినుంచి కేటీఆర్ పక్కదారులు పట్టారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు అన్ని తనకు తెలుసనే, ఒక అప నమ్మకం ఆయనలో బలంగా ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చాలు మనం గెలిచిపోతాం మనకు బాగా క్రేజ్ ఉందని నమ్మే వ్యక్తి.. ఒకరకంగా చెప్పాలంటే ఆయనకు అహంకారం పెరిగిపోయిందని చెప్పవచ్చు..అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కేటీఆర్ తన భుజాలపై వేసుకొని ప్రచారం చేశారు. అయితే తాను పూర్తిగా జనాల్లోకి వెళ్లకుండా సోషల్ మీడియాను నమ్ముకొని, రేవంత్ ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, ప్రభుత్వం ఇలా చేస్తుంది, అలా చేస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు.. అంతేకాకుండా  మెయిన్ మీడియా, పేపర్ ను నమ్మకుండా నకిలీ సోషల్ మీడియా సర్వేలు చేయించి జనాలకు రుద్దాడు..

 ఇక సోషల్ మీడియానే నమ్ముకొని  గెలిచిపోయామనే ఫీలింగ్ లోకి వచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి అలా చేయకుండా, కాంగ్రెస్ పై కాస్త వ్యతిరేకత ఉన్నా కానీ, తాను జూబ్లీహిల్స్ కు ఏం చేశాడో, ఏం చేయబోతున్నాడో మెయిన్ మీడియా, వార్తాపత్రికలను వాడుకొని జనాల్లోకి వెళ్లేలా చేశాడు. ఫేక్ సర్వేలు, ఫేక్ సోషల్ మీడియాను ఎక్కడా కూడా ఉపయోగించలేదు. ఈ విధంగా హైదరాబాదులో కాంగ్రెస్  అభిమానులు లేకున్నా కానీ, జూబ్లీహిల్స్ లో గెలిపించగలిగాడు.. ప్రతిక్షణం అలర్ట్ గా ఉంటూ  కింది స్థాయిలో ఏం జరుగుతుంది, అనేది ఎప్పటికప్పుడు తెలుసుకొని  నవీన్ యాదవ్ గెలుపుకు బంగారు బాటలు వేశాడు.  కేటీఆర్ కూడా  రాత్రింబవళ్లు  జూబ్లీహిల్స్ లో ఉండి ప్రత్యక్షంగా అన్ని విషయాలు తెలుసుకుంటే బాగుండేది. రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఆయన ప్రచారం చేసి అక్కడి కార్యకర్తలకు భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది.  కానీ సోషల్ మీడియాలోనే మాట్లాడుతూ, అన్ని అద్దం  చూపించినట్టు చూపించి గెలుచిపోయామని అహంభావంలోకి రావడం వల్ల జూబ్లీహిల్స్ ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ఇలాంటి లక్షణాలు ఉండటం వల్ల కేటీఆర్ ఎప్పటికీ సీఎం కాలేరని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: