ఎప్పటిలాగానే మీ కోసం ఇండియా హెరాల్డ్  ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకువచ్చింది. మంచి మాటలు అనేవి వినడానికి బాగుంటాయి.. కానీ చేయడానికి కష్టం.. ఎంత కష్టం అయినప్పటికీ.. ఇష్టంగా చేస్తే ఏది అసాధ్యం అనిపించదు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది.. అంతేకాకుండా మనం దేని కోసమైనా తహ తహ లాడుతూ ఉంటే , అందుకు తగ్గట్టుగానే మన  ప్రయత్నం కూడా ఉండాలి.. అప్పుడే మనం ఆశించిన దానిని పొందగలుగుతాము..  జీవితంలో ఏదీ సులభంగా దొరకదు..  కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు అనే ఈ మంచి మాటకు వివరణ..


ఉదాహరణకు మీరు ఐఏఎస్ కావాలని కలగన్నారు అనుకోండి.. అయితే మీ కలలను సాకారం చేసుకోవాలంటే మాత్రం రాత్రింబగళ్ళు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.. అయితే వెంటనే మీకు విజయం రావాలంటే కుదరదు.. ఎంతో శ్రమించి, నేర్పుతో, ఓర్పుతో కష్టపడినప్పుడే ఐఏఎస్  అవ్వాలన్న మీ కల నెరవేరుతుంది.. అలాంటి సందర్భంలో చెప్పేటప్పుడు,  జీవితంలో ఏదీ సులభంగా దొరకదు.. కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు.. ఈ వాక్యాన్ని,  సందర్భాన్ని బట్టి ఈ వివరణ ఇస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు..


 ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలలో ఈ వాక్యాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది.. కాబట్టి ఏదైనా జీవితంలో పొందాలని ఆశిస్తే మాత్రం, తప్పకుండా ప్రయత్నించాలి.. కానీ ఏది అంత త్వరగా దొరకదు..  అది సాధించేవరకు మనం కష్టపడాలి.. అప్పుడే దేవుడు కూడా మనపై దయను చూపిస్తాడు.. మనం కష్టపడే కొద్దీ, సహాయపడడానికి  కూడా చాలామంది ముందుకు వస్తారు.


ఏదైనా ఒక దాంట్లో ఓడిపోతే నిరుత్సాహ పడక, విజయం సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి.. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. చూశారు కదా ఫ్రెండ్. మీరు కూడా మీ కలలను సాకారం చేసుకోవాలంటే మాత్రం,ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అప్పుడే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.. ఏదిఏమైనా కష్టపడితేనే ఫలితం లభిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: