కొందరికి పురుడు అయిన ఎన్ని రోజులకు సెక్సులో పాల్గొనవచ్చనే అనుమానం సహజంగానే కలుగుతుంది. మరికొందరికి కడుపులో ఉండగా గర్భవిచ్ఛిత్తి జరుగుతుందేమోనని మూడోనెల రాగానే అతిజాగ్రత్తకు పోయి భర్తను శృంగార జీవితానికి దూరం చేస్తుంటారు. దీంతో భర్తలు సహనంకోల్పోయి ఇతర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం లేకపోలేదు. సహజ కాన్పు అయిన 45 రోజుల తర్వాత యోని నుంచి ఏ రకమైన దుర్వాసనతో కూడిన రక్తస్రావం కాకుండా గర్భసంచి మునిపటి స్థానంలోకి వెళితే సెక్స్‌లో పాల్గొనవచ్చని వైద్యులు చెపుతున్నారు. అదే సిజేరియన్ చేసి కుట్లు పడితే మాత్రం ఆ కుట్లు పూర్తిగా ఎండిపోయి. ఆమెకు ఎటువంటి నొప్పి లేకుండా ఉంటే నిరభ్యంతరంగా సెక్స్‌లో చేయవచ్చు. లేదంటే. 16 వారాలు ఖచ్చితంగా రతి కార్యంలో పాల్గొనకూడదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇలాంటి సమయాల్లోభార్యభర్తలు ఇరువురూ పైపై శారీరక స్పర్శ సుఖాలకు పొందవచ్చని సూచిస్తున్నారు. అలాగే కాన్పుకు ముందు సెర్విక్స్‌కు కుట్లుపడటం. వెజైనల్‌ బ్లీడింగ్‌ అవడం. అంతకుముందు గర్భాస్రావం జరగడం లాంటివి ఉంటే. సెక్స్‌లో పాల్గొనకూడదు. ఎటువంటి అనారోగ్యం లేకుంటే తొమ్మిదవ నెల వరకు అనుకూలమైన భంగిమలో అంటే కడుపుపై భారం పడకుండా ఉన్న భంగిమలలో దంపతులు సెక్స్‌లో పాల్గొనవచ్చు. కాన్పుకు పది రోజుల ముందు శృంగారం ఆపితే మంచిది. దీనివల్ల గర్భిణికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దక్కుతుంది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి సహకారం ఎంతో అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: