తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల వేడి ఇంకా పూర్తిగా రాజుకోకముందే టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేతులెత్తేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతు ‘తిరుపతి లోక్ సభ లో టీడీపీ ట్రాక్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేద’ని అంగీకరించారు. పనిలోపనిగా తిరుపతి ఉపఎన్నిక ఫలితం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై రెఫరెండం ఏమీ కాదని ఆయనే ఒప్పుకున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ గెలవదని అందరికీ తెలుసు. పోటీచేసే అభ్యర్ధి పనబాక లక్ష్మితో పాటు ఆమెను ఎంపికచేసిన చంద్రబాబునాయుడు, గెలుపు బాధ్యతలు తీసుకున్న reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న+నేతలందరికీ ఫలితం విషయంలో మంచి క్లారిటీనే ఉంది.



అందుకనే ముందు జాగ్రత్తగానే టీడీపీ ట్రాక్ రికార్డు ఆశించినంతగా లేదని అచ్చెన్న ఒప్పేసుకున్నారు. 1984లో టీడీపీ తరపున చింతామోహన్ గెలిచారంతే. మళ్ళీ ఇప్పటివరకు టీడీపీ అభ్యర్ధి గెలిచిందే లేదు. కొన్నిసార్లు పొత్తుల్లో ఇతర పార్టీలకు వదిలేసింది. కొన్నిసార్లు టీడీపీయే పోటీచేసినా ఎప్పుడూ గెలవలేదు. ఈ విషయం అందరికీ బాగా తెలుసు. ఇదే సమయంలో వైసీపీ బాహుబలి స్ధాయిలో బలంగా ఉంది. పంచాయితి, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం స్పష్టంగా అందరికీ అర్ధమైపోయింది. అందుకనే ఓడిపోయే సీటులో పోటీ చేసే విషయంలో పనబాక లక్ష్మి చాలా కాలం పోటీకి వెనకాడారు. చివరకు తప్పని పరిస్ధితుల్లో నామినేషన్ వేశారు.




నిజానికి తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీల్లో కూడా టీడీపీ చాలా బలహీనంగా ఉంది. ఏడు అసెంబ్లీల్లోను వైసీపీ ఎంఎల్ఏలే ఉన్నారు. పైగా మొన్ననే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులు క్లీన్ స్వీప్ చేసేశారు. అంటే పంచాయితి మొదలుకుని మున్సిపాలిటీలు, ఎంఎల్ఏలంతా వైసీపీ వాళ్ళే. ఇది అధికారపార్టీకి కలిసివచ్చే అదనపు బలం. రెండేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమపథకాలే పార్టీని మొన్నటి స్ధానిక ఎన్నికల్లో గెలిపించాయి. దానికితోడు ప్రజాప్రతినిధులు+నేతలంతా కలిసి సమన్వయంతో కష్టపడ్డారు. ఇదే టీడీపీ నేతల్లో లోపించింది. అందుకనే ఉపఎన్నికలు జగన్ ప్రభుత్వంపై రెఫరెండం కాదని ముందు అచ్చెన్నే చెప్పేశారు. అంటే టీడీపీ ఓటమిని అచ్చెన్న ముందుగానే అంగీకరించేసినట్లే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: