మన కుటుంబంలో ఎవరికైనా పెను ప్రమాదం రాబోతున్నప్పుడు మనం పూజించే ఆ దేవత మూర్తులు వాటిని స్వీకరిస్తారట, అలా స్వీకరించినపుడు అందుకు సంకేతంగా కొన్ని చిత్రమైన సంఘటనలు మన ఇంట్లో జరుగుతాయని అందులో దేవుళ్ళ విగ్రహాలు విరిగిపోవడం కూడా ఒకటని తెలుస్తోంది. ఆ దేవుళ్ళు మనకొచ్చే కష్టాన్ని స్వీకరించినపుడు వచ్చే ఒక సంకేతమే అంటున్నారు సర్వం తెలిసిన పండితులు. మనం ఎంతగానో విశ్వసిస్తూ పూజించే ఆ దేవుళ్ళు ఎప్పుడూ మన వెంట ఉంటారన్నది అక్షర సత్యం. ఇక విరిగిపోయిన విగ్రహాలను చాలా మంది గుళ్ళలోనో లేదా ఏదైనా చెట్టుకింధో పెట్టి వచ్చేస్తుంటారు. కానీ ఇలా చేయడం పాపమట. విగ్రహం కనుక స్వల్పంగా విరిగిపోయుంటే గంధంతో పూసి అతికించి తిరిగి పూజించాలట.
ఎలా అయితే మన చెయ్యో కాలో విరిగినపుడు పక్కన పడేయకుండా చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నిస్తామో అలాగే దేవుడు విగ్రహాలను కేవలం ఒక బొమ్మలా చూడకుండా ప్రాణమున్న సాక్షాత్తు ఆ దేవుళ్ళలా భావించి విరిగినప్పుడు వదిలేయకుండా అతికించడానికి ప్రయత్నించి తిరిగి ఆ విగ్రహాలకు పూజలు చేయడం యధావిధిగా కొనసాగించాలి. ఒకవేళ అతికించలేని విధంగా విగ్రహం విరిగితే ఆ విగ్రహాన్ని పారే నీళ్లలో నిమజ్జనం చేయాలి. అంతేకాని గుళ్ళోనో..చెట్టు కిందో పెట్టి వదిలించుకోవడం మంచిదికాదని చెబుతున్నారు పురోహితులు . ఒకవేళ దేవుళ్ళ పఠాలు చిరిగితే పరమ పవిత్రుడైన అగ్నిలో ఆహుతి చేయాలని అంటున్నారు. అంతేకాని రోడ్లపై..ఇంకెక్కడైనా పడేయరాదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి