కాళికాదేవి మాత యొక్క చాలా చిత్రపటాలలో పరమేశ్వరుడు ఆమె పాదాల చెంత ఆసీనులై కనిపిస్తారు. పార్వతికి మరో రూపమైన మహాకాళి శివుని యొక్క సతీమణి. అయితే విశ్వాన్నే శాసించే రుద్రుడు ఇలా భార్య పాదాల వద్ద చిక్కుకోవడం ఏమిటి..??? దాని పరమార్ధం ఏమిటి అన్న విషయం తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఈ చిత్రమైన సంఘటన వెనుక ఒక పెద్ద పురాణగాథ ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రాక్షసులందరినీ సంతరించుకుని  రక్తబీజుడు అనే భయంకర రాక్షసుడు ఆవిర్భవిస్తాడు. ఆ రక్తబీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం వలన అతని రక్తపు చుక్క నేలపై పడితే  అతి భయంకరమైన రాక్షసులు పుట్టుకొస్తారు. ప్రపంచంపై విరుచుకుపడుతున్న ఆ రక్తబీజుడ్ని అంతమొందించేందుకు దుర్గాదేవి కదిలి వస్తుంది. ఆ భయంకర రాక్షసునితో యుద్ధం చేస్తుంది. అయితే బ్రహ్మ ఇచ్చిన వరం వలన  అమ్మవారు రక్తబీజుడిని గాయపరిచిన ప్రతిసారీ అతని శరీరంనుంచి పడిన రక్తపు చుక్కల నుండి రాక్షస సైన్యం పెరుగుతూ వస్తుంది. అయితే ఆ రాక్షసులందరినీ వధిస్తున్న  కొద్ది వేల మంది పుట్టుకొస్తుండడంతో  దుర్గాదేవికి ఆగ్రహం వచ్చి కాళికా మాత అవతారంలోకి మారుతుంది.


అలా ఉగ్రరూపం లోకి మారిన కాళికాదేవి ఆగ్రహంతో రగిలిపోయి రక్తబీజుడిని పట్టుకుని అతని రక్తపు చుక్కలు నేలపై పడకుండా  మొత్తం రక్తాన్ని పీల్చి తాగేస్తుంది. అలా రక్తబీజుడు మరణిస్తాడు. అనంతరం అతని సైన్యాన్ని సైతం మట్టుబెతుతుంది మహాకాళి. అయితే ఆ రాక్షసుని రక్తం అమ్మవారి శరీరంలో కలవడం ద్వారా ఆ దుష్ట ప్రభావం అమ్మవారిపై కాస్త పడుతుంది.  తద్వారా కాళీమాత భీకర నృత్యం చేస్తూ రాక్షసుల రక్తాన్ని తాగుతూ పోతూ ఉండగా ఆమె వేసే ప్రతి అడుగు భూమి పై బీభత్సాన్ని సృష్టిస్తుండడంతో మహా శివుడు మహంకాళి ఆగ్రహాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తాడు.

అయినా ఎంతకీ కాళీమాత శాంతించక పోవడంతో చివరకు ఆమె పాదాలను పట్టుకుని శాంతించు మాత మమ్మల్ని కరుణించు అని వేడుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించిన అమ్మవారు భర్త శంకరుడిని గుర్తించి  చివరకు తన శాంతరూపిణిగా పార్వతి మాత గా మారుతుంది. అలా ఆ సందర్భంలో శంకరుడు మహాకాళి చరణాల వద్ద ఉండాల్సివచ్చిందని పురాణం చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: