సాధారణంగా శివాలయం నిర్మించాము అంటే కచ్చితంగా శివుడి లింగం ముందు నంది ప్రతిష్టాపన జరగాల్సిందే. ఎందుకంటే నంది లేకుండా ఎక్కడా కూడా శివలింగాన్ని ప్రతిష్టింప చేయరు. శివలింగాన్ని దర్శించుకోవాలంటే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు, నందీశ్వరుని దర్శించుకున్న తర్వాతనే శివలింగాన్ని దర్శించుకుంటూ ఉంటాము.. అందుకే ప్రతి శివాలయంలో కూడా శివలింగం ముందు నంది విగ్రహం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.. కానీ ఒక్క ఈ ప్రదేశంలో ఉన్న శివాలయంలో మాత్రం నందీశ్వరుడు లేడట. శివుని దర్శించాలంటే నేరుగా శివ లింగాన్ని దర్శించుకుంటే సరిపోతుందని పండితులు చెబుతున్నారు. అయితే నంది విగ్రహం లేని శివాలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..


కాశీ విశ్వేశ్వర ఆలయం లో శివాలయంలో శివలింగం ముందు నంది లేడట.. ఇలా నందీశ్వరుడు ప్రతిష్ఠించకపోవడానికి గల కారణం ఏమిటో పురాణాలు.. ఏం చెబుతున్నాయి.. అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం..పురాణాల ప్రకారం.. భారతదేశం పై ఔరంగజేబు దండెత్తి,  హిందూ దేవాలయాలు అన్నింటిని వారు ధ్వంసం చేయాలని కంకనం కట్టుకున్నాడు.. దేశంలో ఉన్న శివాలయాలు అన్నింటిని ధ్వంసం చేసుకుంటూ వచ్చిన ఔరంగజేబు చివరిగా కాశీ విశ్వేశ్వర ఆలయానికి చేరుకుని లోపు ఈ విషయాన్ని గ్రహించిన అక్కడి అర్చకులు లింగాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న కోనేటిలో శివలింగాన్ని పడేయడం జరిగింది.


కాశీ విశ్వేశ్వర ఆలయానికి చేరుకున్న ఔరంగజేబు , అతడి సైన్యం అక్కడ ఉన్న ఎంతో ప్రాముఖ్యత కలిగిన శిథిలాలు అన్నింటిని కూల్చివేసి, నందీశ్వరుడిని మాత్రం ఏమి చేయకుండా అలాగే వదిలి వెళ్ళిపోయారు. అతడి సైన్యం తో వెళ్లిపోయిన కొద్దిరోజులకు కోనేటి లో ఉన్న శివలింగాన్ని తీసుకొచ్చి తిరిగి ప్రతిష్టించాలని అనుకున్నారు.. అక్కడి అర్చకులు.. కానీ ఎక్కడ వెతికినా శివలింగం కనిపించకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో శివలింగాన్ని తీసుకువచ్చి మరొక  దేవాలయాన్ని నిర్మించి అక్కడ  ప్రతిష్టించడం జరిగింది.


అందుకే భక్తులు ముందుగా ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శించుకొని , ఆ తరువాత  నందీశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీ.

మరింత సమాచారం తెలుసుకోండి: