
ఆ గ్రహస్థితి బాగుంటే మన అనుకున్న పనులు అంటే, ఉద్యోగం,పెళ్ళి,సంతానం,వ్యాపారం వంటివి సజావుగా జరుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతారు కూడా. ఒక వేళ మనం అనుకున్న పనులు జరగలేదంటే మన జాతకంలో గ్రహాలు సరిగా లేవని,ఆ గ్రహదోష నివారణకు కొన్ని రకాల చెట్లను పూజించాలని సూచిస్తున్నారు. అస్సలు ఎలాంటి చెట్లను పూజించడం వల్ల ఆయా గ్రహాలకు శాంతి కలుగుతుందో తెలుసుకుందాం పదండీ..
సూర్యగ్రహదోషం..
జాతకంలో సూర్య దోషం ఉంటే సూర్యుడు,రాహు-కేతు లేదా శని పీడితులు,పితృ దోషం ఉన్నవారు జిల్లేడు మొక్కను పూజించాలి.మరి ముఖ్యంగా ఆదివారం రోజున జిల్లేడు మొక్క పూజించి,దానితో పాటు సూర్యన్ని పూజించడం వల్ల కూడా గ్రహదోషాలు తొలగుతాయి.
చంద్రగ్రహదోషం..
మీ జాతకంలో చంద్రదోషం లేదా దుష్టశక్తులతో బాధపడుతుంటే మోదుగ వృక్షాన్ని పూజించాలి.మరియు ఆరోజునే శివునికి నీరు సమర్పించడంతో సర్వ గ్రహ దోషాలు తొలగుతాయి.
మంగళ దోషం..
హిందూ మతంలో మర్రి చెట్టుకు పవిత్ర స్థానం వుంది. మంగళదోషం పోవాలనే సంకల్పంతో ఈ చెట్టును పూజిస్తే ఉపశమనం కలుగుతుంది.ముఖ్యంగా 11 మంగళవారాల్లో ఆ వేర్లకు నీళ్లు సమర్పించి,11 ప్రదక్షిణలు చేయాలి.
బుధగ్రహదోషం..
జ్యోతిషశాస్త్రంలో బుధుడు బలహీనంగా లేదా చెడుగా ఉంటే అది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని చెబుతారు.ఆ సమయంలో బుధగ్రహ ప్రభావం పోగొట్టుకోవడానికి ఉత్తరేణి మొక్కను పూజిస్తే చాలు. మరియు ఈ చెట్టును పూజించిన తరువాత,బుధ గ్రహ బీజమంత్రాన్ని 11 సార్లు చెప్పాలి.
గురుగ్రహదోషం..
సాధారణంగా జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి అత్యంత శుభ గ్రహంగా పిలుస్తారు.ఈ గ్రహ దోషం కలవారు రావి చెట్టుకు నీరు పోసి,ఐదు ప్రదిక్షణలు చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది.
శుక్రగ్రహదోషం..
శుక్రు గ్రహ దోషం ఉంటే అప్పుడు మీ జీవితంలో సుఖాలు,వినోదలకు ఎండ్ కార్డ్ పడినట్టే.అలా బాధపడేవారు మేడి చెట్టును పూజించడం ఉత్తమం.అలాగే శుక్రుని మంత్రాన్ని 90 రోజులు జపించాలి.
శనిదోషం..
మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా ఉంటే,ప్రతిరోజూ జమ్మీ మొక్కను పూజించాలి.దీనితో శని వల్ల కలిగే సమస్యల నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.అంతే కాకుండా శనివారం నాడు రావి చెట్టు కింద తప్పనిసరిగా దీపం వెలిగించండం చాలా మంచిది.
రాహుగ్రహ దోషం..
జ్యోతిషశాస్త్రంలో రాహు గ్రహాన్ని చాలా క్రూరమైనదిగా భావిస్తారు.ఎవరి జాతకంలోనైనా ఈ గ్రహం చెడుగా ఉంటే మాత్రం జీవితాన్ని నాశనం చేస్తుంది.అలాంటి వారు అప్పుడు దర్భను పూజించాలి.ప్రతి రోజు దర్భ మూలాలలో నీరు పోసి,రాహువు యొక్క బీజ మంత్రాన్ని జపించాలి.
కేతుగ్రహదోషం..
కేతువు కూడా రాహువు వంటి చాలా క్రూర గ్రహమే.కేతువును శాంతింపజేయడానికి,గణేశుడు దూర్వ మొక్కతో పూజించడం వలన కేతు దోషం తొలగిపోతుంది.