మణికట్టు మాంత్రికుడు ముత్తయ్య మురళీ ధరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు..తమ శ్రీలంక బోర్డుపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు..వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ని వారి ఎదుటే తిరస్కరించి వచ్చేశాడు..ఇంతకీ వాళ్ళు ముత్తయ్యకి ఇచ్చిన ఆఫర్ ఏమిటి..? బోర్డు పై ఎందుకు ముత్తయ్య కోపాని ప్రదర్శించాడు..అంటే..శ్రీలంక క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా చేయమని చెప్పిన బోర్డు కోరికని మాజీ క్రికెటర్లు ఇష్టపడడం లేదు. బోర్డు చేస్తున్న ఆఫర్‌ను గతంలో మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే తిరస్కరించగా..మళ్ళీ స్పిన్ దిగ్గజం ముత్తయ్య కూడా తిరస్కరించాడు.

 Image result for muttiah muralitharan best spin

అయితే బోర్డు నిర్ణయాన్ని తానూ ఎందుకు వద్దు అన్నది కూడా చెప్పాడు. ప్రస్తుతం ఉన్న విధానంపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని అన్నాడు..అందుకే సలహాదారు పదవిని తాను వద్దనుకుంటున్నట్టు చెప్పాడు. అంతేకాదు, బోర్డుపై ఎన్నో విమర్శలు కూడా చేశాడు..శ్రీలంక బోర్డుని గాడిలో పెట్టేందుకు పలువురు మాజీ క్రికెటర్లతో నియమిచిన కమిటీలో ముత్తయ్య ని కూడా తీసుకోవాలని భావించింది బోర్డు..అయితే...బోర్డు ఆహ్వానంపై మురళీధరన్ మాట్లాడుతూ.. క్రికెట్ పరిపాలన పరిస్థితి దుర్భర స్థితిలో ఉన్నప్పుడు తమను ఆహ్వానించడంలో ఏదో తిరకాసు ఉందని భావిస్తున్నట్టు చెప్పాడు.

 Related image

ఈ సమయంలో బోర్డు ఇస్తున్న ఆఫర్ లో ఎదో కారణం ఉందని అన్నాడు..బోర్డు ఆఫర్‌లో నిజాయతీ లేదని విమర్శించాడు..అప్పటి క్రీడామంత్రికి సలహాలు ఇచ్చేందుకు గతేడాది జయవర్థనేను ప్రత్యేక ప్యానెల్‌లోకి తీసుకుంది. గతంలో తాను ఇచ్చిన సలహాలు, సూచనలను పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉందని జయవర్ధనే పేర్కొన్నాడు ఈ సారి అదే పరిస్థితి నాకు కూడా వస్తుంది కాబట్టే నేను ఈ ఆఫర్ ని వదులుకున్నాను అని ప్రకటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: