శ్రీలంక వర్సెస్ న్యూజిల్యాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఓ విచిత్ర సన్నివేశం జరిగింది. శ్రీలంక బౌలర్ లసిత్‌ ఎంబుల్‌డేనియా వేసిన బాల్ న్యూజిల్యాండ్ బ్యాట్స్ మెన్ ట్రెంట్ బౌల్ట్ స్వీప్ చేసే దిశలో బాల్ హెల్మెట్ గ్రిల్స్ లో చిక్కుకుంది. అయితే అదృష్టవశాత్తు ఈ సంఘటనలో బౌల్ట్ కు ఎలాంటి గాయం అవలేదు. 


లసిత్ వేసిన బాల్ బ్యాట్స్ మెన్ బ్యాట్ కు టాప్ ఎడ్జ్ తీసుకున్నట్టు కనిపించగా ఆ తర్వాత బాల్ ఎటెళ్లిందో ఆటగాళ్లకు అర్ధం కాక అయోమయంలో ఉన్నారు. అయితే బౌల్ట్ తన హెల్మెట్ గ్రిల్స్ లో చిక్కుకున్న బాల్ తీయడంతో అందరు షాక్ అయ్యారు. ఈ సీన్ చూసిన ఐసిసి స్వయంగా కాట్ అండ్ బౌల్ట్ అంటూ సరదాగా ట్వీట్ చేసింది.  


అంతేకాదు క్రీడా అభిమానులు కూడా ట్వీట్స్ చేశారు. బౌల్ట్ అది యాపిల్ కాదు క్రికెట్ బాల్.. నువ్వు పొరబడినట్టున్నావ్.. దాన్ని తినేయొద్దంటూ ట్వీట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే న్యూజిల్యాండ్ 249 పరుగులకు ఆలౌట్ అవగా.. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ 267 పరుగులు చేసింది. ప్రస్తుతం 3వ రోజు ఆట కొనసాగుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో న్యూజిల్యాండ్ 3 వికెట్లు కోల్పోయి 44 వికెట్లు కోల్పోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: