నిన్న కోల్కతా నైట్ రైడర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా రంగంలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు దినేష్ కార్తీక్ కెప్టెన్సీలో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది . ఈ క్రమంలోనే ఇటీవల విమర్శలు ఎదుర్కొంటున్న దినేష్ కార్తీక్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. ఇక మోర్గాన్ కెప్టెన్సీ లోకి వచ్చిన తర్వాత కోల్కతా నైట్రైడర్స్ జట్టు పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోయింది.



 ప్రతి మ్యాచ్లో కూడా కనీసం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక మరిన్ని విమర్శలు ఎదుర్కొంటుంది కోల్కత నైట్ రైడర్స్ జట్టు. ప్రత్యర్థి జట్టుకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. బౌలింగ్ ఈ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో కూడా పూర్తిగా విఫలం అవుతున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టు.. ఎన్నో చేత రికార్డులను నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే మరింత దారుణంగా ఆడింది. కేవలం ఎనిమిది వికెట్లు కోల్పోయి 85 పరుగులు మాత్రమే చేసింది. దీంతో తర్వాత బ్యాటింగ్కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో సునాయాసంగా ఇంకా 39 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్ల నష్టానికి టార్గెట్ ను ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది.



 అయితే నిన్న మ్యాచ్లో పేలవమైన ప్రదర్శనతో కోల్కతా జట్టు ఐపీఎల్ చరిత్రలోనే ఎంతో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా అత్యల్పంగా 85 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయిన జట్టుగా 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మొదటిసారిగా చెత్త  రికార్డు నమోదు అయింది అని చెప్పాలి. టైటిల్ ఫేవరెట్ జట్టుగా రంగంలోకి దిగిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇలాంటి చెత్త ప్రదర్శన చేయడం అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. దీంతో ఇంతకుముందు కెప్టెన్సీ బాధ్యతలు దినేష్ కార్తీక్ చేతిలో ఉంటే బాగుండేది అని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇయాన్ మోర్గాన్ చేతిలోకి కెప్టెన్సీ బాధ్యతలు వచ్చిన తర్వాత జట్టు  ప్రదర్శన తీరు మరింత దిగజారిపోయిందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: