
ఇటీవలే ఏకంగా ఇంగ్లాండ్ జరిగిన టెస్టులో 11వ బ్యాట్స్మెన్ గ్రీజూ లో ఉన్న సమయంలో జస్ప్రిత్ బూమ్రా వేసిన బౌలింగ్ మాత్రం కాస్త ప్రమాదకరంగానే మారిపోయింది. రెండో టెస్టులో మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుంది అన్న సందర్భంలో ఇలా ప్రమాదకరంగా బుమ్రా బౌలింగ్ కనిపించడం గమనార్హం. ప్రత్యర్థి జట్టు లోని 11 వ నెంబర్ ఆటగాడిగా జేమ్స్ అండర్సన్ గ్రీజు లో ఉన్నాడు. ఈ క్రమంలోనే జేమ్స్ అండర్సన్ ను బూమ్రా టార్గెట్ చేసాడేమో అనిపించేంతగా ఏకంగా బుమ్రా బౌలింగ్ శైలి కనిపించింది. వరసగా షార్ట్ బంతులు విసిరి అండర్సన్ ను ఒకరకంగా భయ పెట్టించాడు జస్ప్రిత్ బూమ్రా.
ఇక ఇలా ఎంతో ప్రమాదకరంగా బూమ్రా బంతులు విసురుతున్న సమయంలో ఒక బంతి ఏకంగా ఇక అండర్సన్ హెల్మెట్ కి కూడా తగిలింది దీంతో ఏకంగా అండర్సన్ కంకషన్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ జస్ప్రిత్ బూమ్రా మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అదే స్టైల్ లో బంతులు విసిరాడు. దీంతో మరో బంతి ఏకంగా అండర్సన్ పొత్తికడుపు పై బలంగా తాకింది. ఇక బుమ్రా విసిరిన మరో బంతి ఏకంగా పక్కటెముకల వైపు దూసుకొచ్చింది. ఇలా ప్రమాదకరంగా బుమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా ఒకే ఓవర్ లో నాలుగు నో బాల్స్ కూడా వేయడం గమనార్హం. ఇక ఎంత ప్రమాదకరంగా బంతులు చేసినప్పటికీ వికెట్ మాత్రం పడగొట్టా లేకపోయాడు బుమ్రా. ఇక ఆ తర్వాత బౌలింగ్ చేసిన షమి ఓవర్లో అండర్సన్ అవుటయ్యాడు ఈ క్రమంలోనే ఆటగాళ్లు పెవిలియన్కు కోరుకుంటున్న సమయంలో ఇక అండర్సన్ బూమ్రా దగ్గరికి వచ్చి నన్ను ఎందుకు టార్గెట్ చేశావ్ అన్నట్టుగా అడిగాడు. ఇక అండర్సన్ అడిగినదానికి బుమ్రా ఏం సమాధానం చెప్పకుండా చిరునవ్వుతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.