ప్రస్తుతం టీమిండియా సౌత్ ఆఫ్రికాతో మూడు టెస్ట్ లు మరియు మూడు వన్ డే ల సీరీస్ ఆడడానికి ఆఫ్రికా పర్యటనకు వచ్చింది. కాగా మొదటి టెస్ట్ ను ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు జోహన్నస్ బర్గ్ వేదికగా రెండవ టెస్ట్ జరుగుతూ ఉంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా ఇండియా బరిలోకి దిగింది. విరాట్ లేని జట్టును రాహుల్ ముందుండి నడిపించనున్నాడు. అయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ స్టార్ట్ చేసిన టీమ్ ఇండియా మొదట్లో ఆచితూచి ఆడినా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్ మరియు మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు.

మొదటి వికెట్ గా మయాంక్ 26 పరుగులు చేసి మార్కో జాన్సన్ బౌలింగ్ లో అవుట్ కాగా, ఆ తర్వాత పుజారా మరియు రహానే లు ఇద్దరూ వరుసగా ఒలివర్ బౌలింగ్ లో ఔట్ అయి పెవిలియన్ చేరారు. ఇప్పుడు వీరిద్దరి మీద నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముందుగానే ఇద్దరూ ఫామ్ కోల్పోయి జట్టులో స్థానం ఉంటుందా అన్నా స్థితిలో ఉన్నారు. ఈ సీనియర్ ఆటగాళ్లకు ఈ సీరీస్ చాలా ముఖ్యం. అయితే దానికి తోడు లాస్ట్ టెస్ట్ లోనూ సరైన ప్రదర్శన చేయలేదు. ఇప్పుడు రెండవ టెస్ట్ లోనూ ఉసూరుమనిపించారు. అయితే ఒకప్పుడు టీమ్ ఇండియాకు ఆపధ్బాందవులు లాగా ఉండేవారు.

కానీ గత కొంత కాలంగా నాసిరకంగా ఆడుతున్నారు. ఒకవైపు యంగ్ ప్లేయర్ ల నుండి గట్టి పోటీ ఉండగా ఈ విధమైన ఆటతీరు వారి కెరీర్ కే ప్రమాదం. వీరు ఇలా విఫలం కావడానికి కారణం ఏమై ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వీరిపై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం మూలంగానే ఒత్తిడి పెరిగిపోయి వరుసగా ఫెయిల్ అవుతున్నారు అట. మరి రెండవ ఇన్నింగ్స్ లో అయినా తమ డైన ఆటతీరు కనబరిచి విమర్శకుల నోరు మూయిస్తారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: