ఐపీఎల్ హిస్టరీ లో నే సక్సెస్ఫుల్ బౌలర్ గా పేరు సంపాదించుకున్నాడు రషీద్ ఖాన్. తన స్పిన్ బౌలింగ్ లో ఎప్పుడు మాయ చేస్తూ ఉంటాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెప్టెన్లు రషీద్ ఖాన్ కి బంతి అందిస్తూ ఉంటాడు. ఎందుకంటే తన స్పిన్ బౌలింగ్ తో ఆడటానికి ఇబ్బంది పడే బ్యాట్స్మెన్లు ఇక ఒత్తిడికి గురవుతూ వికెట్ సమర్పించుకుంటూ వుంటారు. ఇలా ఇప్పటివరకు ఎన్నో సార్లు రషీద్ ఖాన్ సక్సెస్  అయ్యాడు. అందుకే అతన్ని వికెట్ టేకర్ కూడా అంటూ ఉంటారు. ఇక మొన్నటివరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగిన రషీద్ ఖాన్ ను ఇటీవలే సన్రైజర్స్  పట్టించుకోకుండా మెగా వేలంలోకి వదిలేయడంతో గుజరాత్ టైటాన్స్ అతని దక్కించుకుంది.


 టాలెంట్ ఉండాలి కానీ ఏ జట్టుతో ఆడితే ఏంటి అనే విధంగానే రషీద్ ఖాన్ గుజరాత్ తరపున కూడా రెచ్చిపోయి అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం బౌలింగ్తో మాత్రమే కాదు బ్యాటింగ్  తో కూడా అదరగొడుతూ తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నారు. రషీద్ ఖాన్ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉన్నాడు. కానీ ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం అటు రషీద్ఖాన్ పూర్తిగా తేలిపోయాడు. తనను తాను ఒక మంచి వికెట్ టేకర్ గా భావించే రషీద్ఖాన్ కూడా ఊహించి ఉండడు రషీద్ ఖాన్ బౌలింగ్ లో సన్రైజర్స్ బ్యాట్స్మెన్లు చితకొట్టుడు కొడతారని.


 ఫోర్లు సిక్సర్లతో చెలరేగిపోయారూ. సన్రైజర్స్ లో జరిగిన మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు ఓవర్లో ఏకంగా 45 పరుగులు ఇచ్చేశాడు రషీద్ ఖాన్. అంతే కాదు ఒక్క వికెట్ కూడా పడగొట్ట లేకపోవడం గమనార్హం. ఇక అభిషేక్ శర్మ రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఆడిన 15 బంతుల్లో 34 పరుగులు పిండుకున్నాడు. ఎప్పుడు బ్యాట్స్మెన్లను కట్టడి చేస్తూ తక్కువ పరుగులు ఇవ్వడమే కాదు వికెట్ టేకర్ గా పేరు సంపాదించుకున్న రషీద్ ఖాన్ బౌలింగ్ చేయడం చాలా అరుదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇది చూసిన సన్రైజర్స్ అభిమానులు అయ్యో పాపం రషీద్ ఖాన్ కూడా ఇది ఊహించి ఉండడూ అంటూ కామెంట్ చేస్తున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl