భారత క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్  ప్రస్తుతం క్రికెట్ లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. అతని ప్రతిభను ఎవరు గుర్తించలేకపోతున్నారు అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ జట్టు గత ఏడాది ఐపిఎల్ సీజన్ సమయంలో అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి జట్టుకు అంటిపెట్టుకుంది ముంబై ఇండియన్స్. కానీ అతడిని మాత్రం బెంచ్ స్ట్రెంత్ కే పరిమితం చేసింది. ఒక్క సారి కూడా తుది జట్టులో అవకాశం కల్పించలేదు. 2022 సీజన్ లోనూ అదే జరిగింది. 2022 సీజన్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది ముంబై ఇండియన్స్ జట్టు. వరుస ఓటములతో సతమతమయ్యింది. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టకుండా ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ ఆడే నామమాత్రపు మ్యాచ్లో బెంచ్ స్ట్రెంత్ ని పరిశీలించారు. దీంతో యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. దీంతో అర్జున్ టెండూల్కర్ కూడా అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అర్జున్ టెండూల్కర్ నీ తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో రోహిత్ శర్మ గురువు సచిన్ టెండూల్కర్ కు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు  సోషల్ మీడియాలో ప్రశ్నించారు.


 ఇప్పుడు అర్జున్ టెండూల్కర్కు మరో అవమానం జరిగింది అని తెలుస్తోంది. అటు రంజీ నాకౌట్స్ కోసం ప్రకటించిన ముంబై జట్టులో కూడా అతనికి స్థానం గల్లంతయింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా బ్యాటర్ అజింక్య రహనే తో పాటు ముంబై జట్టులో అర్జున్ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు అతన్ని కీలకమైన నాకౌట్ మ్యాచ్ కు పక్కన పెట్టడం గమనార్హం. కాగా ఈ నాకౌట్ మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రావాలని భావించాడు అర్జున్ టెండూల్కర్. సెలెక్టర్లు మాత్రం అతనికి మొండిచెయ్యి చూపారు. ఇక సచిన్ తనయుడుకీ ఇలాంటి పరిస్థితి రావడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

 కాగా రంజి నాకౌట్ మ్యాచ్ ఆడబోయే  జట్టు వివరాలు ఇలా ఉన్నాయి :  పృథ్వీ షా(కెప్టెన్‌), య‌శ‌స్వి జైస్వాల్‌, భూపేన్ లాల్వానీ, అర్మాన్ జాఫ‌ర్‌, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌, సువేద్ పార్క‌ర్‌, ఆక‌ర్షిత్ గోమ‌ల్‌, ఆదిత్య తారే, హార్ధిక్ త‌మోర్‌, అమాన్ ఖాన్‌, సాయిరాజ్ పాటిల్‌, షమ్స్ ములానీ, దృమిల్ మ‌ట్క‌ర్‌, త‌నుష్ కోటియాన్‌, శ‌శాంక్ అతార్డే, ధవ‌ల్ కుల‌క‌ర్ణి, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తీ, రొస్తాన్ డ‌యాస్‌, సిద్ధార్థ్‌ రౌత్‌, ముషీర్ ఖాన్..

మరింత సమాచారం తెలుసుకోండి: