మొన్నటి వరకు స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగిన హార్థిక్ పాండ్య ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కెప్టెన్ గా ప్రమోషన్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్గా ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఒకవైపు జట్టులో ఉన్న ఆటగాళ్లను  సమన్వయం చేస్తూ ఆటగాళ్లు స్వేచ్ఛగా తమ ప్రతిభను చాటుకునేందుకు అవకాశం కల్పిస్తూనే మరోవైపు జట్టులో ఒక ఆటగాడిగా కూడా తన ప్రదర్శన తో అదరగొట్టాడు హార్దిక్ పాండ్యా. ఈక్రమంలోనే హార్థిక్ పాండ్యా కెప్టెన్గా ఆల్రౌండర్గా అదరగొట్టిన తీరు చూస్తే అతని పై ప్రశంసలు కురిపించ లేకుండా ఉండలేక పోతున్నారు ఎవరైనా.


 ఇకపోతే హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాగా రాణించినప్పటికీ బ్యాట్స్మెన్గా మంచి పరుగులు చేసినప్పటికీ అటు బౌలింగ్ లో మాత్రం ఎక్కువగా ఓవర్లు వేయలేదు హార్దిక్ పాండ్యా. కొన్ని మ్యాచ్ లలో అసలు బౌలింగ్ జోలికి పోలేదు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పై మరిన్ని అనుమానాలకు తెర మీదికి వచ్చాయి. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా సక్సెస్ అవుతున్నప్పటికీ ఇక అటు బౌలర్గా మాత్రం రాణించలేక పోవడంతో అతడు టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమేనని అందరు అనుకున్నారు. కానీ ఇటీవలే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ తో కూడా సత్తా చాటాడు.



 ఏకంగా మూడు ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాదండోయ్ కీలక సమయంలో మూడు వికెట్లు పడగొట్టడం గమనార్హం. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ లో కూడా ఏకంగా 39 పరుగులు చేసి రాణించాడు హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే అద్భుతమైన స్పెల్ తో మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 2009లో అనిల్ కుంబ్లే తర్వాత అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్ గా నిలిచాడు. 2009 ఐపీఎల్ సీజన్లో ఆర్సిబి కెప్టెన్ అనిల్ కుంబ్లే ఉన్న సమయంలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: