గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరఫున బరిలోకి దిగి జావెలిన్ త్రో  విభాగంలో గోల్డ్మెడల్ సాధించి ఇండియాలో ఒక్కసారిగా సూపర్ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించాడు నీరజ్ చోప్రా. ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ ఇండియా కు అందని ద్రాక్షలా ఉన్న గోల్డ్ మెడల్ సాధించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా గోల్డ్మెడల్ సాధించి అదరగొట్టిన నీరజ్ చోప్రా ఇక ఇటీవల ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో బరిలోకి దిగాడు. భారత్ నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉన్నప్పటికీ అందరి చూపు మాత్రం నీరాజ్ పైనే ఉంది అని చెప్పాలి.


 గత ఏడాది టోక్యో ఒలంపిక్స్ లాగానే ఇక ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో కూడా అదరగొట్టి గోల్డ్మెడల్ సాధిస్తాడు అని నమ్మకం పెట్టుకున్నారు అందరూ. ఎందుకంటే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇప్పటి వరకు భారత్ కేవలం ఒకే ఒక్క మెడల్ మాత్రమే గెలిచింది. అది కూడా రజత పతకం కావడం గమనార్హం. అప్పటి నుంచి ఎంతో మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని ఉన్నప్పటికీ కూడా భారత్ మెడల్ మాత్రం సాధించలేక పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారి నీరజ్ చోప్రా తప్పకుండా మెడల్ సాధించి తీరుతాడు అని నమ్మకం పెట్టుకున్నారు.


 అయితే అందరూ అనుకున్నట్లుగా నీరజ్ చోప్రా గోల్డ్మెడల్ సాధించ లేదు. కేవలం అడుగు దూరంలో ఆగిపోయి సిల్వర్ మెడల్ సాధించి పెట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ల తర్వాత ఇక ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఇటీవల సిల్వర్ మెడల్ సాధించడంతో స్పందించిన నీరజ్ చోప్రా  ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో 88.13 మీటర్లు బల్లెం విసిరిన  తాను.. 90 మీటర్ల మార్క్ అందుకోవడానికి దగ్గరలో కి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.  బల్లెం వదిలే పద్ధతి సమయంపై దృష్టిసారించడం  వల్ల ఇక ఈ ఏడాది నా ప్రదర్శన స్థిరంగా ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: