మొన్నటికి మొన్న ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా వరుసగా టీ20 వన్డే సిరీస్ లు గెలిచి సత్తా చాటిన టీమిండియా.. ఇటీవలే  వెస్టిండీస్ పర్యటనలో కూడా అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఇక యువ ఆటగాళ్లతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగింది టీమిండియా. ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. అయితే మొదటి రెండు మ్యాచ్ లలో నువ్వానేనా అన్నట్లు గా పోటీ జరగగా ఇక మూడో మ్యాచ్లో మాత్రం టీమిండియా పూర్తి ఆధిపత్యం సాధించింది.


 ఏకంగా 119 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది అని చెప్పాలి. వరుసగా మూడు విజయాలు సాధించడంతో 3-0 తేడాతో ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా. ఇక ఇప్పుడు టి20 సిరీస్ విజయం పై కన్నేసింది అన్న విషయం తెలిసిందే. జులై 29వ తేదీ నుంచి 20 సిరీస్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇటీవలే వెస్టిండీస్ జట్టుపై వన్డే మ్యాచ్లలో అదరగొట్టిన నేపథ్యంలో అటు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో  టీమిండియా సత్తా చాటింది అని చెప్పాలి. పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది టీం ఇండియా.


 మొన్నటివరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో 106 పాయింట్లతో పాకిస్తాన్ తో కలిసి సంయుక్తంగా మూడవ స్థానంలో కొనసాగిన టీమిండియా.  ఇక వెస్టిండీస్తో వన్డే సిరీస్ 3-0 కోట్లతో క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో నాలుగు పాయింట్లు సాధించి తద్వారా 110 పాయింట్లతో భారత్ మూడో స్థానానికి చేరుకోగా పాకిస్థాన్ నాలుగో స్థానానికి పడిపోయింది అని చెప్పాలి. ఈ లిస్టులో 101 పాయింట్లతో ఆస్ట్రేలియా ఐదవ స్థానంలో కొనసాగుతోంది. 128 పాయింట్లతో న్యూజిలాండ్ టాప్ లో ఉండగా 199 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: