క్రికెట్ లో ఎందరో ఆటగాళ్లు అరంగ్రేటం చేసి తమ తమ జట్లకు అసాధారణ విజయాలను అందించారు. అయితే ఏ అతగాడికి అయినా తాను జట్టుకు ఉపయోగపడుతున్నంతవరకే వారికి తగిన మద్దతు, విలువ మరియు ప్రయోజనాలు ఉంటాయి. అలా కాకుండా తమ ఫామ్ ను కోల్పోయి విఫలం అవుతూ వస్తే ఇక అంతే సంగతులు.. అతనిపై వేటు, విమర్శలు సర్వ సాధారణం అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి క్రికెటర్ అయినా నిలకడగా ఉండడం కుదరని పని, అలాంటి సమయం లోనే తమ క్రికెట్ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను రాత్రికి రాత్రే ప్రకటిస్తూ ఫ్యాన్స్ కు షాక్ లు ఇస్తూ ఉంటారు.

తాజాగా అలాంటి ఒక వార్త క్రీడాలోకాన్ని నివ్వెరపరుస్తోంది. ప్రపంచ క్రికెట్ లో భాగం అయిన ఐర్లాండ్ జట్టు గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు. ఈ టీం లో గత 6 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన అల్ రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్, అన్ని ఫార్మాట్ లకు వీడ్కోలు పలుకుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది విన్న ఐర్లాండ్ క్రికెట్ మరియు అభిమానులు తీవ్ర బాధలో ఉన్నారు. ఈ విషయాన్ని ఓబ్రెయిన్ తన ట్విట్టర్ ద్వారా కాసేపటి క్రితమే తెలియచేశాడు. గత టీ20 ప్రపంచ కప్ తర్వాత తప్పుకోవాలని అనిపించినా మరికొంతకాలం కొనసాగడం అనుకుని వాయిదా వేసుకున్నాడట.

కానీ ఆ తర్వాత జరిగిన ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ లకు తనను సెలెక్టర్లు పట్టించుకోకపోవడం తో మనస్థాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇతను తన కెరీర్ లో 153 వన్ డే లు, 110 టీ 20 ల్లో 5592 పరుగులు   చేశాడు. అంతే కాకుండా తన దేశ తరపున కెవిన్ ఓబ్రెయిన్ ఒక్కడే టెస్ట్ లలో సెంచరీ ని చేసిన ఘనతను సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: