గత కొన్ని రోజుల నుంచి వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్న టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది. ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే జింబాబ్వే గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ప్రాక్టీస్ లో మునిగి తేలుతోంది. అయితే ఈ నెల 18వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది.. అయితే ఈ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే టీం ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.


 కొంతకాలం నుంచి గాయం బారినపడి కోలుకుని ఇటీవల టీమిండియాకు సెలెక్ట్ అయిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే తో వన్డే సిరీస్ కి ముందు మళ్లీ గాయం  బారినపడి జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో  మరో యువ ఆల్రౌండర్ ను  టీమిండియా జట్టు లోకి ఎంపిక చేసింది అని తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆర్సిబి ఆల్రౌండర్ బెంగాల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ను జింబాబ్వే పర్యటనకు సెలెక్ట్ చేసింది బీసీసీఐ. ఈ విషయం తెలిసి ఇతని గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా వేదికగా తెగ వెతికేస్తున్నారు అభిమానులు.


 కాగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఓ మోస్తారు ప్రదర్శన చేశాడు షాబాజ్ నదీమ్. టీమిండియా  తరఫున ఎంట్రీ కోసం ఎదురుచూస్తుండగా వూహించని అవకాశం అతను తలుపు తట్టింది. బెంగళూరు జట్టు తరఫున 29 మ్యాచ్లలో 118 బైక్ రేటు 279 పరుగులు.. 8.58 ఎకానమీ తో 13 వికెట్లు పడగొట్టాడు. ఇతనికి ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు ఉన్నాయ్. బ్యాటింగ్ లో మూడు శతకాలు 10 అర్థ శతకాలు.. బౌలింగ్లో 7/57 అత్యుత్తమ ప్రదర్శన.. 100 వికెట్లకు పైగానే సాధించాడు. ఇందులో రెండు సార్లు 5 వికెట్లు హాల్ ఘనతను సాధించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: