టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంటే తెలియని క్రికెట్ ప్రేక్షకుడు లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా గత కొన్నేళ్ల నుంచి అయితే రవీంద్ర జడేజా అద్భుతమైన పర్ఫామెన్స్ చేస్తూ ప్రపంచ క్రికెట్లో తన పేరు మారుమోగిపోయేలా చేస్తూ ఉన్నాడు అని చెప్పాలీ. ఇలా తన పర్ఫామెన్స్ తో తన పేరు తెలియని వారికి సైతం తెలిసేలా చేశాడు. ఇకపోతే ఇటీవల రవీంద్ర జడేజా గాయం బారిన పడి టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. ఇటీవలే మోకాలి శాస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే రవీంద్ర జడేజా గాయం నేపథ్యంలో ఎంతోమంది స్నేహితులు కలవడానికి వస్తూ పరామర్శిస్తున్నారు. భారత్ ఓపెనర్ శేఖర్ ధావన్ కూడా రవీంద్ర జడేజాను కలవడానికి వెళ్ళాడు. కలవడానికి వెళ్ళినవాడు కలిసి పరామర్శించి రాకుండా తనదైన శైలిలో మరోసారి కుప్పిగంతులు వెయ్యడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియోని శిఖర్ ధావన్ ఏకంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.


 ఒకవైపు రవీంద్ర జడేజా కాలుకి చికిత్స తీసుకుంటున్న సమయంలో పక్కనే నిలబడిన శిఖర్ ధావన్ డాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు ఈ వీడియోలో.  ఈ క్రమంలోనే ఇతనికి పెళ్లి చేసేయండి.. పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది అనే డైలాగ్ ని లిప్ సింక్ అయ్యేలా చెప్పాడు రవీంద్ర జడేజా. ఇక ఇది చూసిన ఎంతో మంది నటించిన శిఖర్ ధావన్ ఎక్కడికి వెళ్లినా ఇలాంటివి చేయడం మాత్రం అస్సలు మానడు. ఇక శిఖర్ ధావన్ లో మాకు నచ్చేది కూడా ఇలాంటి ఆటిట్యూడ్  అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: