ఇటీవల కాలంలో భారత క్రికెట్లో దినేష్ కార్తీక్ బాగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాడు. 37 ఏళ్ల వయసులో భారత జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడమే కాకుండా తనదైన శైలిలో అద్భుతంగా రాణిస్తూ ఫినిషిర్ పాత్ర పోషిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక టి20 ప్రపంచ కప్ లో కూడా అతని స్థానం తుదిచెట్టులో సుస్థిరం అయింది అన్నది అందరూ అనుకుంటున్నా మాట. ఇక తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో వార్తల్లో నిలుస్తున్న దినేష్ కార్తీక్ ఇప్పుడు తన హెల్మెట్ డిజైన్ తో కూడా వార్తల్లోకి వచ్చాడు.  సాధారణంగా క్రికెట్ అభిమానులు ఆటగాళ్ల యొక్క ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించారు. ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నారు అన్న విషయాన్ని కూడా చూస్తూ ఉంటారు.


 ఈ క్రమంలోనే ఇటీవల దినేష్ కార్తీక్ ధరించిన హెల్మెట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. అయితే మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే అటు దినేష్ కార్తీక్ పెట్టుకునే హెల్మెట్ డిజైన్ మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు జెర్సీ రంగు మారిపోయిన నేపథ్యంలో అటు హెల్మెట్ రంగు కూడా మారింది అని చెప్పాలి. దినేష్ కార్తీక్ లాంటి హెల్మెట్ నే గతంలో కుమార సంగకర, కెవిన్ పీటర్సన్ లాంటి వాళ్లు కూడా ధరించేవారు అని చెప్పాలి. అయితే ఇక ఈ హెల్మెట్ అందరూ ధరించే హెల్మెట్ల కాకుండా చిన్నచిన్న ఖాళీలు ఉండడం కనిపిస్తూ ఉంటుంది.


 అయితే ఇలా ఖాళీలు ఉండడం కారణంగా ఎక్కువ సేపు ధరించినప్పటికీ కూడా ఈ హెల్మెట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందట. అయితే వికెట్ల వెనకాల కీపింగ్ చేసే వ్యక్తులు ఎక్కువ సేపు హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దినేష్ కార్తీక్ మిగతా ఆటగాళ్లతో పోల్చి  చూస్తే ఇలాంటి భిన్నమైన హెల్మెట్ ధరిస్తాడు అన్న విషయం మాత్రం తెలుస్తుంది. ఈ హెల్మెట్ కారణంగా చెమట ఎక్కువ పట్టే అవకాశం ఉండదట. ఒకవేళ చెమటలు పట్టిన రంద్రాల నుంచి  గాలి వెళ్లడం కారణంగా చెమటలు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ కారణంగానే దినేష్ కార్తీక్ ఈ హెల్మెట్ ధరిస్తూ ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: