
ఇండియా అసలైన మ్యాచ్ లకు దొరికిన ఈ అవకాశాన్ని వాడుకోవడంలో సక్సెస్ అయిందని చెప్పాలి. ఓపెనర్లు రోహిత్ మరియు రాహుల్ లు... వీరిద్దరూ మొదటి వికెట్ కు 78 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. రోహిత్ మాత్రం 15 పరుగులకే అవుట్ కాగా.. రాహుల్ మాత్రం అర్ద సెంచరీ 57 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ , హార్దిక్ పాండ్య, కార్తీక్ లు విఫలం కాగా సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే ఇండియాకు పోరాడగలిగే స్కోర్ 186 ను అందించాడు. ఇండియాను రిచర్డ్ సన్ ఒక్కడే 4 వికెట్లతో అడ్డుకుని ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఆరు బంతుల వరకు ఫేవరెట్ గా ఉంది.
కానీ ఆఖరి ఓవర్ లో మహమ్మద్ షమీ బంతిని అందుకుని ఏకంగా ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించేశాడు. ఆఖరి ఓవర్ లో 11 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో హిట్టర్ కమిన్స్ మరియు జోష్ ఇంగ్లీష్ ఉన్నారు. అయితే మొదటి బంతి నుండి యార్కర్ లనే వేశాడు. మొదటి రెండు బంతులకు కమిన్స్ 2 పరుగుల చొప్పున జోడించగా, మూడవ బంతిని భారీ షాట్ ఆడబోయి కోహ్లీ అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు అవుట్ అయ్యాడు. తర్వాత బంతికి లేని పరుగుకు ప్రయత్నించి అగర్ అవుట్ అయ్యాడు. ఇక మిగిలింది రెండు బంతులు చేయాల్సింది 7 పరుగులు మాత్రమే. ఆ తర్వాత రెండు బంతులను కూడా మహమ్మద్ షమీ పదునైన యార్కర్ లను విసిరాడు. అలా ఇండియాను ఓటమి నుండి గెలుపుకు దారి చూపించాడు. దీనితో బుమ్రా బదులుగా వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయిన మహమ్మద్ షమీ వార్మ్ అప్ మ్యాచ్ లోనే తాను కరెక్ట్ సెలక్షన్ అని ప్రూవ్ చేసుకున్నాడు.