
ఇకపోతే ప్రస్తుతం టీమిండియా వరల్డ్ కప్ లో భాగంగా వరుస మ్యాచ్ లతో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ కప్ ముగిసిన వెంటనే వివిధ దేశాల పర్యటనకు వెళ్లేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ఇకపోతే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే అటు న్యూజిలాండ్తో వన్డే టి20 సిరీస్ లో ఆడబోతుంది టీమిండియ. ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్ తో కూడా వరుస సిరీస్ లతో బిజీ అవ్వబోతుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఇక బంగ్లాదేశ్ న్యూజిలాండ్తో ఆడబోయే వరుస సిరీస్లలో భారత జట్టు వివరాలను అధికారికంగా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక మరోసారి కొంతమంది ఆటగాళ్లకు నిరాశ ఎదురయింది అని చెప్పాలి.
ఇక ఎన్నో రోజుల నుంచి జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్న పృథ్వి షా, ఉమేష్ యాదవ్, నితీష్ రానా, రవి బిష్ణయ్ లకు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. దీంతో ఇక టీం ఇండియా సెలెక్టర్ల తీరుపై ఈ ఆటగాళ్లు సోషల్ మీడియాలో నిరాశ వ్యక్తం చేశారు. నువ్వు అన్ని చూస్తున్నావు అని ఆశిస్తున్నా అంటూ పృద్విషా సాయిబాబా ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నువ్వు నన్ను ఫూల్ చేయొచ్చు.. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త అంటూ ఉమేష్ యాదవ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.. హోప్ అంటూ నితీష్ రానా ఒక పోస్ట్ పెట్టగా.. సెట్ బ్యాక్ కంటే కమ్ బ్యాక్ బలమైంది అంటూ రవి బిష్ణయ్ ఇక తన అసంతృప్తిని వ్యక్తం చేసాడు అని చెప్పాలి.