ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా ఘోర వైఫల్యం చెందడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒక్కో ఫార్మాట్ కి ఒక్కో కెప్టెన్ ఉండాలి అన్న కొత్త చర్చ తెరమీదకి వచ్చింది. కేవలం కెప్టెన్ మాత్రమే కాదు ఇక ప్రతి ఫార్మాట్ కి ప్రత్యేకమైన ఒక స్పెషల్ కోచ్ ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 ఇక ఇప్పటికి ఇదే విషయంపై ఎంతో మంది స్పందించగా ఇక ఇటీవల మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ సైతం ఇక ఈ చర్చలోకి చేరాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2024 టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు ఎంతో మెరుగ్గా రాణించాలి అంటే టి20 ఫార్మాట్ కు కొత్త కోచ్ అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. మిగతా ఫార్మాట్లతో పోల్చి చూస్తే టి20 ఫార్మాట్ కాస్త భిన్నమైనది. అందుకే ఇక ఈ ఫార్మాట్లో అద్భుతంగా రానించిన ఆశిష్ నెహ్ర లాంటి వారిని కోచ్ గా నియమిస్తే 2024 వరల్డ్ కప్ కి మరింత మెరుగ్గా జట్టును నిర్మించవచ్చు.


 అలాగని రాహుల్ ద్రావిడ్ ను పక్కన పెట్టాలి అని చెప్పను. ఆశిష్ నెహ్ర, రాహుల్ ద్రావిడ్ కలిసి పనిచేస్తే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. న్యూజిలాండ్తో సిరీస్ సమయంలో రాహుల్ ద్రావిడ్ కు విశ్రాంతి ప్రకటించారు. అలాంటి సమయంలో మరో కోచ్ ఉంటే బాధ్యతలు చూసుకుంటాడు. అంతేకాదు ఫార్మాట్ ను బట్టి ఇక ఆటగాళ్లను కూడా మార్చుతూ ఉండాలి అంటూ హార్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాలో ఆటగాళ్లు తమ పద్ధతి మార్చుకొని దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో ఉండే మొదటి ఆరు ఓవర్లలో దూకుడుగా ఆడాలనిసూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: