ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు అయినటువంటి సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా భారత క్రికెట్ అభిమానులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య కుమార్ యాదవ్ ఈ మధ్య కాలంలో ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తన అద్భుతమైన ప్రదర్శనతో టీం ఇండియాకు ఎన్నో విజయాలను అందించాడు . ఇది ఇలా ఉంటే సూర్య కుమార్ యాదవ్ ఈ మధ్య కాలంలో టెస్ట్ మరియు వన్డే సిరీస్ లతో పోలిస్తే టి 20 సిరీస్ లో అత్యుత్తమైన ప్రదర్శనను ఇస్తున్నాడు . దానితో సూర్య కుమార్ యాదవ్  ప్రస్తుతం టి 20 ఫార్మేట్ లో ప్రపంచం లోనే నెంబర్ 1 ప్లేయర్ గా కొనసాగుతున్నాడు .

అలాగే సూర్య కుమార్ యాదవ్ ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి టి 20 మ్యాచ్ లోను అదిరిపోయే రేంజ్ పెర్ఫార్మెన్స్ ను కనబరిచాడు . ఇలా టి 20 మ్యాచ్ లో సూపర్ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సూర్య కుమార్ యాదవ్ తాజాగా న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో పాల్గొన్నాడు . న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా సూర్య కుమార్ అవుట్ అయిన విధానంపై భారత మాజీ క్రికెటర్ అయినటువంటి వసీం జాఫర్ తాజాగా స్పందించాడు.  టి 20 మ్యాచ్ లో స్లీప్ ఫిల్డర్స్ ఉండరు కాబట్టి పెద్దగా ఏలాంటి ప్రమాదం ఉండదు. అందువలన ఈ విషయంలో సూర్య కుమార్ యాదవ్  మెరుగుపడాలి. లేకపోతే సూర్య కుమార్  టెస్ట్ సీరీస్ లు ఎలా ఆడుతాడో అనే అనుమానం వ్యక్తం అవుతుంది అని వసీం జాఫర్ తాజాగా అన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ వర్షం కారణంగా రద్దు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: