ఖతార్  వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ప్రస్తుతం సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వరల్డ్ కప్ ప్రారంభం అయింది అంటే చాలు ఇక గతంలో వరుసగా వరల్డ్ కప్లలో విజయాలు సాధించి ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న టీం లే మరోసారి సత్తా చాటుతాయని అందరూ అంచనాలు పెట్టుకుంటారు. కేవలం కొంతమంది మాత్రమే ఇక వరల్డ్ కప్ లో కొత్త జట్టు ఛాంపియన్గా అవతరిస్తుందని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో అందరి అంచనాలు తారుమారు అవుతున్నాయి.


 అప్పటివరకు ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో దాదాపు నాలుగు లేదా ఐదు సార్లు కప్పు గెలుచుకొని ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న జట్ల చేతిలో ఓటమిపాలై టోర్ని నుంచి నిష్క్రమిస్తూ ఉండడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇలాంటి ఊహించని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఇక ప్రతి మ్యాచ్ కూడా మరింత ఉత్కంఠ భరితంగా మారిపోయింది అని చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి ఫలితాలు ఎన్నో రాగా.. ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదయింది అని చెప్పాలి. ఏకంగా క్రొయేసియా జట్టు సెమీఫైనల్ చేరితే ఇక ఐదుసార్లు ఛాంపియన్గా కొనసాగుతున్న బ్రెజిల్ మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించింది.



 ఇటీవల క్వార్టర్ ఫైనల్స్ లో క్రొయేషియా, బ్రెజిల్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇక ఐదు సార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి అటు సెమీఫైనల్ లో అడుగుపెడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని ఫలితాలు వెలువడ్డాయి అని చెప్పాలి. ఏకంగా క్వార్టర్ ఫైనల్ లో భాగంగా జరిగిన మ్యాచ్లో క్రొయేసియా చేతిలో ఓటమిపాలైంది. పెనాల్టీ షూట్ అవుట్ రౌండ్లో క్రొయేసియా విజయం సాధించింది అని చెప్పాలి. ఏకంగా 4-2 తేడాతో ఛాంపియన్ బ్రెజిల్ను ఓడించింది. దీంతో ఈ ఓటమితో బ్రెజిల్ ఇంటి బాట పడితే సెమీఫైనల్ లో అడుగుపెట్టింది క్రొయేసియా.

మరింత సమాచారం తెలుసుకోండి: