ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ప్రస్తుతం ఇక చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఎన్నో రోజుల నుంచి మ్యాచ్లను వీక్షిస్తున్న క్రీడ అభిమానులందరూ కూడా ఈ మ్యాచ్లలో ఉన్న ఉత్కంఠతో మైమరిచిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో సంచలన ఫలితాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఎవరు ఊహించిన విధంగా పసికూన జట్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తే ఇక ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న టీమ్లు మాత్రం పేలవమైన ప్రదర్శనతో చివరికి టోర్నీ నుంచి నిష్క్రమించాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇలా ఏకంగా దిగ్గజ జట్లను సైతం ఓడించి ముందుకు దూసుకు వచ్చిన కొన్ని జట్లకు ఇక ఒక్క అడుగు దూరంలో చివరికి నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో జరిగిన మ్యాచ్లో క్రొయేషియా ఓడిపోయింది. దీంతో వరల్డ్ కప్ టైటిల్ గెలవాలన్న కల ఆ జట్టుకు కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. ఏడది వరల్డ్ కప్ లో మొదటి నుంచి గొప్ప పోరాట ప్రతిభను ఘనపరిచింది క్రోయేషియా. ఈ క్రమంలోనే అభిమానులు అందరిలో కూడా వరల్డ్కప్ టైటిల్ పై కొత్త ఆశలు చిగురించేలా చేసింది.


  ఫ్రీక్వాటర్స్ లో జపాన్ లాంటి పటిష్టమైన జట్టును ఓడించి ముందుకు దూసుకుపోయిన క్రోయేషియా జట్టు.. ఇక క్వార్టర్స్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయినా బ్రెజిల్ నూ సైతం చిత్తు  చేసి అదరగొట్టింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రోయేషియా ఫైనల్ లో అడుగు పెట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవలే సెమి ఫైనల్లో అర్జెంటినాతో జరిగిన మ్యాచ్లో పై చేయి సాధించలేకపోయింది. ఎంత ప్రయత్నించినా ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. దీంతో ఇక ఈ పరాజయాన్ని అటు జట్టులోని ఆటగాళ్లు మాత్రమే కాదు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: