టీమిండియాలోకి అరంగేట్రం చేసిన తక్కువ సమయంలోనే బ్యాట్స్మెన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రిషబ్ పంత్. ఏకంగా ధోని వారసుడు అంటూ ఒకగొప్ప ట్యాగ్ కూడా సంపాదించాడు అని చెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్లో ఎంతో దూకుడుగా ఆడుతూ టీమిండియా కష్టాల్లో అన సమయంలో ఎన్నోసార్లు విజయాన్ని అందించాడు అని చెప్పాలి. ఇక అలాంటి రిషబ్ పంత్ గత కొంతకాలం నుంచి మాత్రం పేలవమైన ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.


 ఇక ఆ తర్వాత భారత్ ఆడుతున్న ద్వైపాక్షిక సిరీస్ లలో కూడా రిషబ్ తన బ్యాటింగ్తో ఆకట్టుకోలేకపోయాడు అని చెప్పాలి. ఇక ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో కూడా రిషబ్ పంత్ కి మరోసారి అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు రిషబ్ పంత్. అయితే వరుస అవకాశాలు ఇస్తున్నప్పటికీ అతను వినియోగించుకోలేకపోతున్నాడు అని అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే ఇక అతను పేలవమైన ఫామ్ లో ఉన్నాడని తెలిసినా కూడా ఇక ఇటీవల టెస్ట్ ఫార్మాట్లో మరోసారి అవకాశం ఇచ్చారు బీసీసీఐ సెలెక్టర్లు. మరోసారి రిషబ్ పంత్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. కానీ మునుపటి ప్రదర్శనతో పోల్చి చూస్తే పరవాలేదు అనిపించాడు.


 ఈ క్రమంలోనే రిషబ్ పంత్ గురించి పాకిస్తాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే ఫిట్నెస్ గురించి పంత్ కూ పలు సూచనలు చేశాడు సల్మాన్ భట్. రిషబ్ పంత్ అధిక బరువు ఉండడం కారణంగానే క్రీజులో చురుగ్గా కదల లేకపోతున్నాడు. ఇంకా ఫిట్ గా ఉంటే మాత్రం టెస్ట్ ఫార్మాట్లో కొత్త షాట్లను ఎంతో ఈజీగా కొట్టగలడు. తప్పకుండా రిషబ్ పంత్ ఇక ఫిట్నెస్ పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ సల్మాన్ బట్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: