టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఇక ఇటీవల గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తీవ్ర గాయాల పాలైన రిషబ్ పంత్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పంత్ త్వరగా కోరుకుంటున్నాడు అని బీసీసీఐ వర్గాలు చెబుతూ ఉన్నప్పటికీ అతను కోలుకోవడానికి మళ్లీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడానికి మాత్రం ఆరు నెలల సమయం పడుతుంది అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్. ఈ క్రమంలోనే ఇక అతను మరికొన్ని రోజుల్లో స్వదేశంలో జరగబోయే వరుస సిరీస్ లకు దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 అయితే అటు ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్ట్ సిరీస్ తో పాటు మరికొన్ని సిరీస్ లకు దూరమవుతాడు అన్న టాక్ వినిపిస్తుండగా.. అటు ఈ ఏడాది జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి కూడా అతను అందుబాటులో ఉంటాడు అన్నది అనుమానం గానే కనిపిస్తుంది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ నాటికి మాత్రం అతను అందుబాటులోకి వస్తాడని అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న ఎంతోమంది స్టార్ క్రికెటర్లు అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.


 ఇకపోతే ప్రస్తుతం రిషబ్ పంత్ ముంబైలోని కోకిలబెన్ ధీరు బాయ్ అంబానీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఐపీఎల్లో ఢిల్లీ కాపిటల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాడు డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. రిషబ్ పంత్తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. త్వరగా కోలుకో పంత్.. నీ వెనుక మేమున్నాం అంటూ ఒక కామెంట్ జోడించాడు డేవిడ్ వార్నర్. కాగా ప్రస్తుతం డేవిడ్ వార్నర్ రిషబ్ పంత్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడుతున్నాడు అన్న విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: