గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పై విమర్శలు వస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటి వరకు పాకిస్తాన్ జట్టుని వారి సొంత దేశంలో ఓడించడం అసాధ్యమని క్రికెట్ విశ్లేషకులు భావించేవారు అని చెప్పాలి. ఎంత దిగ్గజ జట్టుకు అయినా సరే పాకిస్తాన్ ను వారి సొంత దేశంలో ఓడించడం సవాల్ లాంటిది అని అంచనా వేసేవారు. కానీ ఇటీవల కాలంలో పాకిస్తాన్ పర్యటనకు  వెళుతున్న అన్ని విదేశీ జట్లు కూడా అటు పాకిస్తాన్ ను  వారి సొంత గడ్డపైనే దారుణంగా ఓడిస్తూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 మొన్నటికి మొన్న ఎన్నో ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు.. దూకుడు అయిన ఆట తీరుతో పాకిస్తాన్ కు సొంత గడ్డపై షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీంతో కెప్టెన్ బాబర్ పై తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చాయి. అయితే అటువంటినే అటు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ లో పర్యటించగా ఆ జట్టుతో కూడా మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది పాకిస్తాన్ జట్టు.


 అయితే ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా సొంత గడ్డపై సత్తా చాట లేక పోయింది పాకిస్తాన్ జట్టు.  ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి అని చెప్పాలి. ఈ రెండు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా విజయం సాధించలేకపోయింది. ఇక రెండు మ్యాచ్లు డ్రాగ ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక పాక్ కెప్టెన్ బాబర్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఆ దేశ మాజీ క్రికెటర్ డానీష్ కనేరియా ఇదే విషయంపై మండిపడ్డాడు. బాబర్ ఈ సిరీస్ కు కెప్టెన్ గా బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు. అతనికి క్రికెట్ సెన్స్ లేదు.. పరుగులు చేసేందుకు అవకాశం  ఉన్న చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. అందుకే మళ్లీ సర్పరాజ్ అహ్మద్ కు కెప్టెన్సీ అప్పగించాలంటూ డేనిష్ కనేరియా డిమాండ్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: