
ఇటీవల సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే.. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపిఎల్ లో ఉన్న ఫ్రాంచైజీలే ఇక అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కూడా ఉన్నాయ్. ఈ క్రమంలోని ఈస్టర్న్ కేఫ్ జట్టుకు ఫ్రాంచైజిగా కొనసాగుతుంది సన్రైజర్స్. ఇటీవల తొలి మ్యాచ్ లోనే ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ అయిన ప్రిటోరియా క్యాపిటల్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన ప్రిటోరియస్ క్యాపిటల్స్ జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్స్ సాల్ట్ అదిరిపోయే ఆరంభం అందించాడు.
మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సహకారం లేకపోయినప్పటికీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 77 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది ప్రటోరియ క్యాపిటల్స్ జట్టు. ఇక ఆ తర్వాత లక్ష చేదనకు దిగిన సన్రైజర్స్ ఈస్టర్ను కేఫ్ జట్టు చివరి వరకు పోరాడింది అని చెప్పాలి. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 23 పరుగుల తేడాలతో ఓడిపోయి మొదటి మ్యాచ్ లోనే పరాజయాన్ని చవి చూసింది అని చెప్పాలి. ఇక ఇలా మ్యాచ్లో చెలరేగిన ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ అటు ఐపిఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కొనసాగుతున్నాడు.