
ఇక ప్రపంచ క్రికెట్లో అతను నయా 360 ప్లేయర్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన శ్రీలంకతో టి20 సిరీస్ లో భాగంగా సూర్యకుమార్ యాదవ్ మరోసారి సెంచరీ చేసే చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లందరూ కూడా అతనిపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడి సైతం ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ అయిన సర్ వివియన్ రీచార్డ్స్ తో సూర్యకుమార్‌ను పోల్చాడు.
భారత స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధానం ఎంతో అద్భుతమైనది అంటూ టామ్ ముడి చెప్పుకొచ్చాడు. నేను క్రికెట్లో ఆడే తొలి రోజుల్లో సర్ వివియన్ రిచార్డ్స్ కూడా సూర్య లాగానే బ్యాటింగ్ చేస్తూ విధ్వంసం సృష్టించేవాడు. ప్రస్తుతం సూర్య కుమార్ ని చూస్తుంటే మళ్ళీ నాకు రిచార్డ్స్ గుర్తుకు వస్తున్నాడు అంటూ టామ్ మూడి చెప్పుకొచ్చాడు. అతడికి ఒంటి చేత్తో జట్టును గెలిపించే సత్తా ఉంది అంటూ ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేసాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.