భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మది ప్రత్యేకమైన స్థానం అన్న విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీతో పాటు అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇక ఇప్పటివరకు క్రికెటర్ గా సాధించిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అద్భుతమైన ఆటతీరుతో ఎన్నో ప్రపంచ రికార్డులను ఖాతాలో వేసుకున్న రోహిత్ శర్మ ఇప్పటికీ యువ ఆటగాళ్లతో పోటీ పడుతూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ఆట తీరుతో ఇక హిట్ మ్యాన్ అనే ఒక అరుదైన బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు  సాధించి తనకు తిరుగులేదు అని నిరూపించాడు.


 అయితే భారత క్రికెట్ లో ఉన్న మిగతా ఆటగాళ్ళతో పోల్చి చూస్తే రోహిత్ శర్మ సిక్సర్లు కొట్టడంలో దిట్ట అని చెప్పాలి. మైదానంలో పాతుకుపోయి ఇక బౌలర్ ఎక్కడ బంతి సంధించిన కూడా ఎంతో అలవోకగా సిక్సర్లు బాదేస్తూ ఉంటాడు. ఇలా కేవలం స్కోరుతో మాత్రమే కాదు సిక్సర్లతో కూడా ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు రోహిత్ శర్మ. ఇక ఇలా సిక్సర్లు కొట్టడం విషయంలో ఇటీవలే మారో మైలురాయిని అధిగమించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇటీవల న్యూజిలాండ్ తో టీమ్ ఇండియా వన్డే సిరీస్ ఆడింది. ఈ వన్డే సిరీస్ లో భాగంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ లో మంచి టచ్ లో కనిపించాడు.


 తనదైన శైలిలో భారీ సిక్సర్లు బాదాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే వన్డే ఫార్మాట్లో ఓపెనర్ గా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానానికి ఎగబాకాడు అని చెప్పాలి. అయితే ఈ లిస్టులో వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది 351 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రిస్ గేల్ 331 సెక్షర్లతో రెండవ స్థానంలో ఉండగా ఇక రోహిత్ శర్మ 271 సిక్సర్లతో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: