
కాగా రేపటి నుండి మూడు టీ 20 ల సిరీస్ మొదలు కానుంది. రేపు సాయంత్రం సరిగ్గా 7 గంటలకు జార్ఖండ్ లోని రాంచి వేదికగా మొదటి టీ 20 స్టార్ట్ కానుంది. ఈ సిరీస్ కు సీనియర్ లు అయిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లిలకు టీం మేనేజ్మెంట్ విశ్రాంతిని ఇవ్వడం గమనార్హం. ఇక ఈ టీం ను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నడిపించనున్నాడు. ఈ సిరీస్ ద్వారా యంగ్ క్రికెటర్ లు అయిన ఋతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, జితేష్ శర్మ, ప్రిథ్వి షా , శివమ్ మావి , రాహుల్ త్రిపాఠి లకు మరో సువర్ణావకాశం లభించింది. ఈసారి అయినా వీరు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని రాణిస్తారా చూడాలి.
ఇక కివీస్ టీం కు యంగ్ ఆల్ రౌండర్ మిచెల్ శాంట్ నర్ సారధ్యాన్ని వహించనున్నాడు. ఈ టీం లో కూడా అందరూ యువ ఆటగాళ్లే కావడం విశేషం.. ఫిన్ అలెన్, బ్రెసెవెల్ , చాప్ మాన్ , డేన్ క్లివర్ లకు మంచి ఛాన్స్ అని చెప్పాలి. ఇక ఏ క్షణంలో అయినా మ్యాచ్ ను మలుపు తిప్పగల ఫెర్గుసన్, మిచెల్ , ఫిలిప్స్ , సోది లతో ఇందునియా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే వన్ డే సిరీస్ ను కోల్పోయిన కివీస్ కనీసం టీ 20 సిరీస్ ను అయినా గెలుచుకుంటుందా చూడాలి .