ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు ఇటీవల కాలంలో నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా మూడు ఫార్మాట్లలో కూడా భాగమైన ఆటగాళ్లు కొన్ని కొన్ని సార్లు ఇక ఏదో ఒక ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఇలా స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వారు ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇక మిగతా ఫార్మట్లలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకొని అభిమానులకు షాక్  షాప్ ఇచ్చారు. అయితే కేవలం ఒకే దేశానికి చెందిన క్రికెటర్లు మాత్రమే కాదు ఇక ప్రపంచ టికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారందరికీ కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పాలి. వరుస షెడ్యూల్ కారణంగా ఇక కనీసం ఫ్యామిలీతో కూడా గడపలేనంత బిజీగా ఉంటున్నారు. అయితే ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లతో బిజీగా ఉన్న సమయంలోనే మరోవైపు ఇక అటు దేశీయ లీగ్ లు కూడా జరుగుతూ ఉండడంతో ఇక అక్కడ కూడా ఆడేస్తూ ఉన్నారు ఎంతోమంది ప్లేయర్లు.


 ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్ లుగా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ సైతం ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. తీరికలేని క్రికెట్ వల్ల ఎంతగానో అలసిపోయాను అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు. అయితే జట్టులో ఉన్న కొంతమంది సహచర ఆటగాళ్లు యూఏఈ లీగ్ లో ఆడటానికి వెళ్లారని... తనకు మాత్రం ఇంట్లో గడపడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ తెలిపాడు. కాగా డేవిడ్ వార్నర్ గత ఆగస్టు నుంచి వరుసగా న్యూజిలాండ్, జింబాబ్వే, ఇంగ్లాండ్లలో వన్డే సిరీస్లో టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికాలతో టెస్ట్ సిరీస్లలో కూడా భాగం అయ్యాడు అని చెప్పాలి. త్వరలో ఇండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కూడా వార్నర్ ఆడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: