
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియాను న్యూజిలాండ్ జట్టు సొంత గడ్డ పైన చిత్తుగా ఓడించింది అని చెప్పాలి. దీంతో టీమ్ ఇండియా ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో భాగంగా అటు మొదటి మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు రెండవ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల న్యూజిలాండ్, టీమ్ ఇండియా మధ్య రెండో టి20 మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత బౌలింగ్ విభాగం అదరగొట్టింది అని చెప్పాలి.
ప్రత్యర్థి న్యూజిలాండ్ ను కేవలం 99 పరుగులకు మాత్రమే కట్టడి చేసి పది వికెట్లు తీసేసింది. ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో జరిగిన టి20 లో ప్రత్యర్థి జట్టును ఒక్క సిక్సర్ కూడా కొట్టనివ్వకపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక 99 పరుగులకు ఆల్ అవుట్ అయిన న్యూజిలాండ్ కేవలం 6 ఫోర్లు మాత్రమే కొట్టగలిగింది. ఇక మరోవైపు న్యూజిలాండ్ను భారత్ 100 లోపే కట్టడి చేయడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇక న్యూజిలాండ్ కు భారత్ పై అత్యల్ప స్కోరు కూడా ఇదే. అంతేకాకుండా ఇక ప్రత్యర్థులపై నలుగురు భారత స్పిన్నర్లు వికెట్ తీయడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.