ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో భారత పర్యటనకు వచ్చిన ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న  భారత్ ఇక పటిష్టమైన ఆస్ట్రేలియాని కూడా చిత్తు చేసేందుకు సిద్ధమవుతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్ లు జరగబోతున్నాయి అని చెప్పాలి. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టడానికి భారత జట్టుకు అటు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలవడం ఎంతో తప్పనిసరి అని చెప్పాలి.


 పటిష్టమైన ఆస్ట్రేలియాను చిత్తు చేస్తేనే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇక ఇరు జట్లు కూడా ఈ టెస్ట్ సిరీస్ కోసం సన్నతమవుతున్నాయి. అంతేకాకుండా ఈ టెస్ట్ సిరీస్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా రివ్యూలు ఇస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇరు జట్లను కూడా గాయాల బెడద వేధిస్తూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడు భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని షాప్ తగిలింది.



 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. అయితే ఇక తొలి టెస్ట్ మ్యాచ్ కు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్కు దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.  ఈ విషయాన్ని స్లార్క్  స్వయంగా వెల్లడించాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టెస్ట్ లో భాగంగా స్టార్కు వేలికి గాయం అయింది. అయితే ఆ గాయం ఇంకా మానలేదు. అయితే గాయం వల్ల తొలి టెస్టులో నేను ఆడటం లేదు. రెండో టెస్ట్ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాను. అయితే తొలి టెస్టుల్లో ఆస్ట్రేలియా గెలవాలి అంటూ కోరుకున్నాడు మిచెల్ స్టార్క్.

మరింత సమాచారం తెలుసుకోండి: