మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు వినిపించిందంటే చాలు కోట్లాదిమంది అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు. అందరి క్రికెటర్లతో పోల్చి చూస్తే అటు ధోని సోషల్ మీడియాలో ఎక్కడ యాక్టివ్ గా ఉండడు. ఇక అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేది కూడా చాలా తక్కువే. కానీ ఎందుకో మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే మాత్రం అభిమానులను సంపాదించుకోవడంలో మహేంద్ర సింగ్ ధోని ఒక మెట్టు పైనే ఉంటాడు అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరియర్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇంకా ధోని క్రేజ్ కాస్తైన తగ్గలేదు.


 అయితే ధోని సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ ఇక ధోనీకి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కేవలం ఐపిఎల్ లో ఆటుటం ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా వాణిజ్య ప్రకటనల్లో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ఇప్పుడు వరకు మహేంద్ర సింగ్ ధోని వాణిజ్య ప్రకటనలో భిన్నమైన గెటప్లలో కనిపించడం చూసాం.


 అయితే ఇక ఇప్పుడు ధోని పోలీస్ ఆఫీసర్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ధోని ఒక యాడ్ షూట్ లో పాల్గొన్నారు. ఇక ఇలా పోలీస్ గెటప్ లో కనిపిస్తున్న ధోని నిజమైన పోలీసు లాగానే ఉన్నాడు అని చెప్పాలి. ఇది చూసి ధోని ఎలాంటి గెటప్ వేసిన అది అతనికి బాగా సెట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం 2023 ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాడు ధోని. అదే సమయంలో ఒక ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి సినిమా కూడా స్టార్ట్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: