
అయితే స్వదేశంలో జరుగుతున్న సిరీస్ కావడంతో ఇక భారత జట్టు తమకు అనుకూలంగా స్పిన్ స్పీచ్లను తయారు చేసుకొని ఇక ప్రత్యర్థి పైచేయి సాధించే అవకాశం కూడా ఉందని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ హీలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఈ రోజు జట్ల మధ్య వర్మప్ మ్యాచ్ కల్పించకపోవడం పై అసహనం వ్యక్తం చేశాడు. భారత పర్యటనలో భాగంగా సరైన పిచ్ లను రూపొందిస్తే తప్పకుండా ఆస్ట్రేలియానే విజయం సాధిస్తుందంటూ చెప్పుకొచ్చాడు.
భారత్ పిచ్ లు ఇరుజట్లకు సహకారం అందించే విధంగా తయారు చేస్తే అటు ఆస్ట్రేలియా తప్పకుండా విజయం సాధించేందుకు అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు. తనకు ఉన్న ఒకే ఒక ఆందోళన మిచెల్ స్టార్క్, లియాన్ బౌలింగ్ పైనే ఉంది. గత సీరిస్ లో సరైన పిచ్ లని రూపొందించలేదు. దీంతో తొలి రోజు నుంచే బంతి బౌన్స్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో మాకంటే భారత్ కే చాలా బాగా ఆడేందుకు అవకాశం ఉంటుంది. భారత్లో 10 వికిట్లు తీయడానికి 10 అవకాశాలే ఉంటాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే బౌన్స్, బంతి ముందుకు వెళ్లడం వేగం ఇలా 13 అవకాశాలు ఉంటాయి అంటూ చెప్పొచ్చాడు. భారత ఆటగాళ్ళు ఎంత ఒత్తిడి ఉన్న తట్టుకుంటారు. ఇక ఇదే సూత్రాన్ని ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఫాలో కావాలి అంటూ సూచించాడు.