
ఇక టీమిండియాలో ఉన్న మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే కేవలం ఆట విషయంలోనే కాదు ఫిట్నెస్ విషయంలో కూడా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఇక విరాట్ కోహ్లీ ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు అతని అద్భుతమైన ఆటతీరు ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటుంది. అయితే విరాట్ కోహ్లీ ఎంత కఠినంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడో అన్నదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వరకు ట్విట్టర్ వేదికగా చాలానే వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ టార్గెట్ మిస్ అవ్వకుండా ఎలా దూసుకుపోతాడు అన్నదానికి నిదర్శనంగా ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఇప్పటివరకు ఎంతోమంది క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఇక భారీ షాట్లు కొట్టడం ఎలా అన్న విషయాన్ని నేర్చుకోవడం చూసాము. కానీ విరాట్ కోహ్లీ మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని ప్రాక్టీస్ చేశాడు. ఇలా కోహ్లీ కళ్ళకు గంతలు కట్టుకున్న.. అతని టార్గెట్ మాత్రం మిస్ అవ్వలేదు. ఇటీవల వైరల్ గా మారిపోయిన వీడియోలో.. కోహ్లీ కళ్ళకు గంతులు కట్టుకుని కొంత దూరం వెళ్లి ఇక వికెట్ల వైపు త్రో చేశాడు. ఏకంగా బంతి వెళ్లి మిడిల్ వికెట్ కు తగిలింది. ఇక మరోవైపు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కూడా కళ్ళకు గంతలు కట్టుకొని ప్రాక్టీస్ చేశాడు. భారీ షాట్లు కొట్టాడు. అయితే ఈ వీడియో పాతది అయినప్పటికీ ఇప్పుడు కోహ్లీ అభిమానులను తెగ ఆకర్షిస్తుంది.