బోర్డర్ గావాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే అందరూ ఎదురుచూస్తున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ కు నాగ్పూర్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు కూడా రివ్యూలు ఇచ్చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే.. ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా టీమిండియా తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగబోయే జోడి ఏది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా అయితే రోహిత్ శర్మకు జోడిగా  రాహుల్ ఓపెనింగ్ దిగుతూ ఉంటాడు.  కానీ గత కొంతకాలం నుంచి యువ ఆటగాడు శుభమన్ గిల్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కూడా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మకు జోడిగా శుభమన్ గిల్ ఓపెనింగ్ చేస్తాడా లేకపోతే కేఎల్ రాహుల్ ని ఓపెనింగ్ జోడీగా పంపిస్తారా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై మాట్లాడిన కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 జట్టు విజయం కోసం ఎలాంటి త్యాగం చేయడానికి అయినా తాను సిద్ధమే అంటూ చెప్పుకొచ్చాడు. అవసరమైతే తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి మిడిల్ ఆర్డర్లో  బ్యాటింగ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను అంటూ తెలిపాడు. ఈ సిరీస్ గెలవడం తమ జట్టుకు ఎంతో ముఖ్యమని.. వరల్డ్ టెస్ట్  ఛాంపియన్షిప్ ఫైనల్లో చేరడమే తమ లక్ష్యం అంటూ కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు. అయితే ఇంకా తొలి టెస్ట్ ఆడబోయే తుది జట్టును నిర్ణయించలేదు. ఇంకా కొన్ని ఖాళీలను పూర్తి చేయాల్సి ఉంది. అయితే నేను కేవలం ఓపెనర్ గా మాత్రమే రావాలని కోరుకోవట్లేదు. జట్టు కోసం ఏమైనా చేస్తాను. ఇక భారత పిచ్ లలో టర్నింగ్ ఉంటుంది కాబట్టి ముగ్గురు స్పిన్నర్లతో ఆడాలని అనుకుంటున్నాం. మ్యాచ్ ప్రారంభం రోజు పిచ్ ను చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: