
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ అటు కోహ్లీ మాత్రం ఫాలోవర్ల విషయంలో టాప్ లో కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఈ రేంజ్ లో కోహ్లీ క్రేజ్ ఉన్న తర్వాత ఇక కోహ్లీకి సంబంధించిన ఏదైనా పోస్ట్ వస్తే వైరల్ గా మారకుండా ఎలా ఉంటుంది. ఇలా కోహ్లీ కొన్ని కొన్ని సార్లు ఆసక్తికర పోస్టులు పెట్టడం.. అది ఇంటర్నెట్ను షేక్ చేయడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల కోహ్లీ పెట్టిన ఒక పోస్ట్ కాస్త తెగచక్కర్లు కొడుతుంది. ఏకంగా నా ఫోన్ పోయింది అంటూ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. ఇది కాస్త వైరల్ గా మారిపోయింది.
అన్ బాక్సింగ్ చేయకుండానే తన కొత్త ఫోన్ పోయిందని ఇక ఇంతకు మించిన బాధ మరొకటి ఉండదు అంటూ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. మీరు ఏమైనా నా ఫోన్ చూశారా అంటూ అభిమానులను అడిగాడు. అయితే విరాట్ కోహ్లీ పెట్టిన ఈ పోస్ట్ కి అటు జొమాటో బదులు ఇస్తూ ఏం పర్లేదు బాబి ఫోన్ తీసుకుని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకొని తినండి ఉపయోగపడుతుంది అంటూ చమత్కారంగా ఒక కామెంట్ చేసింది అని చెప్పాలి. అయితే కోహ్లీ కేవలం ప్రమోషన్స్ కోసమే ఇలా పోస్ట్ పెట్టాడని కొంతమంది అనుకుంటుంటే.. బాబి ఫోన్ లో జొమాటో కాకుండా స్విగ్గి ఉంటే ఎలా అని మరి కొంతమంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.