
ఈ క్రమంలోనే నాగపూర్ వేదిక జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఏకంగా 132 పరుగుల తేడాతో భారత జట్టు ఆస్ట్రేలియన్ ఓడించింది అని చెప్పాలి. భారత బౌలింగ్ విభాగం బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణించడంతో ఆస్ట్రేలియా కు పుంజుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం చేతులెత్తయగా భారత్‌కు విజయం వరించింది అని చెప్పాలి. కాగా ఢిల్లీ వేదికగా ఈ నెల 17వ తేదీన రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. కాగా భారత జట్టుకు బాగా అచ్చొచ్చన్న మైదానం కావడంతో రెండవ టెస్టు మ్యాచ్ లో కూడా భారత్ దే విజయం అంటూ ఎంతో మంది క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే తొలి టెస్ట్ లో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టుపై ఇక ఆ దేశ మాజీ ఆటగాడు మైకల్ క్లార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్ట్ లో సరైన టీంను తీసుకోకపోవడం వల్ల ఆస్ట్రేలియా టీమ్ ఇండియాను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడింది అంటూ అభిప్రాయపడ్డాడు. రెండవ టెస్టుల్లోనైనా ట్రావీస్ హెడ్‌కు తుది జట్టులో చోటు కల్పించాలంటూ సూచించాడు. తొలి టెస్టులో అతని తీసుకోకపోవడం ఆస్ట్రేలియా కు పెద్ద మైనస్ గా మారింది అంటూ చెప్పుకొచ్చాడు. రేన్ షాను పక్కన పెడితే ఆస్ట్రేలియా తమ చేతులను తామే కాల్చుకున్నట్లు అవుతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా రెండవ టెస్టులో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ని పక్కన పెట్టి అతని స్థానంలో స్పిన్నర్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.