
వెన్ను నొప్పి గాయం బారిన పడిన బుమ్రా ఆ గాయం నుంచి కోలుకోవడానికి నానా కష్టాలు పడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. దాదాపు గత 8 నెలల నుంచి కూడా అతను క్రికెట్ కి దూరంగానే ఉన్నాడు. బూమ్రా లాంటి కీలకమైన బౌలర్ లేకుండానే టీమిండియా ఏకంగా వరల్డ్ కప్ లాంటి టోర్నీలను కూడా ఆడింది అని చెప్పాలి. అయితే ఐపీఎల్ నాటికి బుమ్రా మళ్లీ అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పట్లో బుమ్రా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు అని బీసీసీఐ తెలిపింది.
అయితే వెన్నుముక సమస్యతో బాధపడుతున్న బుమ్రా దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. అయితే అతనికి ప్రత్యేకమైన సర్జరీ కోసం న్యూజిలాండ్ పంపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించిందట. గతంలో ఇలాంటి సమస్య ఉన్న ఇంగ్లాండ్ ఫేసర్ జొప్రా ఆర్చర్ కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటన్ దగ్గర ఇక ఇప్పుడు బుమ్రాకి కూడా సర్జరీ చేయించాలని బిసిసిఐ భావిస్తుంది. అతను పూర్తిగా కోలుకోవటానికి దాదాపు 6 నెలలు సమయం పడుతుందట. అయితే ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ నాటికి అతను అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.