విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే చాలు బౌలర్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది.  అతనికి ఎక్కడ బంతి వేయాలో తెలియక ఒత్తిడికి గురవుతూ ఉంటాడు ప్రత్యర్థి బౌలర్. విరాట్ కోహ్లీ మైదానంలో ఉన్నాడు అంటే చాలు ఇక అతని వైపు బంతి అస్సలు కొట్టకూడదు అని ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కూడా అనుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక మైదానంలో బాంగ్ర స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించడంలో.. స్లెడ్జింగ్ చేసి ప్రత్యర్థుల ఏకాగ్రతను దెబ్బ కొట్టడంలో విరాట్ కోహ్లీ దిట్ట అని చెప్పాలి.


 ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన ఫీల్డర్లలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉంటాడని ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతూ ఉంటారు. కానీ అలాంటి విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి బ్యాటింగ్లో మాత్రమే కాదు ఫీల్డింగ్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్లో పేలవ  ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ ఫీల్డింగులో అయితే కీలకమైన క్యాచ్ లు జార విడుస్తూ  ఉన్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవలే అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్  చేస్తున్న సమయంలో ఏకంగా చాక్లెట్లు తింటూ కాలక్షేపం చేయడం కాస్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.


 సాధారణంగానే టెస్ట్ మ్యాచ్లు సుదీర్ఘంగా దాదాపు 90 ఓవర్ల పాటు సాగుతాయి. కాబట్టి ఇక తమలో ఎనర్జీ నింపుకునేందుకు ఎంతో మంది ప్లేయర్లు చిరు తిండ్లు తినడం లాంటివి కెమెరాల్లో చాలా సార్లు చూస్తూ ఉంటాం. ఇక వీలైనప్పుడల్లా నోట్లో ఏదో ఒకటి వేసుకొని ఎనర్జీని తెచ్చుకోవడం బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న వారికి బాగా సెట్ అవుతూ ఉంటుంది. కానీ స్లిప్ లో ఫీల్డింగ్  చేస్తున్న ప్లేయర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఒక్క సెకండ్ ఆలస్యమైన కీలకమైన క్యాచ్ లు చేజారి పోతూ ఉంటాయి. కానీ కోహ్లీ మాత్రం స్లీప్ లో ఫీల్డింగ్ చేస్తూన్న సమయంలో చాక్లెట్ తింటూ కనిపించడంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాక్లెట్ తిన్నాక ఇక క్యాచ్ లు  మిస్ అవ్వకుండా ఎలా ఉంటాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: