ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత బౌలర్లు ఇక వికెట్ పడగొట్టడానికి తీవ్రంగా శ్రమిస్తూ ఉండడం కూడా కనిపిస్తూ ఉంది. మొదటి రోజు ఆట ముగిసే సరికి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. ఇక అప్పటికే భారీ స్కోరు చేయడం గమనార్హం.


 అయితే సాధారణంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోటీ జరిగింది అంటే చాలు ఇరుజట్ల ఆటగాళ్లు కూడా సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసి ఎప్పుడు తమ ప్రదర్శనతో వార్తల్లో నిలవడం చూస్తూ ఉంటాం.  కానీ ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఒక్క రోహిత్ శర్మ మినహా ఇప్పటివరకు ఇరు జట్ల నుంచి ఏ ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయలేదు. కానీ ఇటీవల నాలుగో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ తో అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని ప్రదర్శన పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తుంది.


 కాగా తన సెంచరీ గురించి మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా. చివరి టెస్ట్ మ్యాచ్ లో సాధించిన సెంచరీ తన కెరియర్ లో ఎంతో అద్భుతమైనది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సెంచరీలో చాలా ఎమోషన్ కూడా ఉంది అంటూ తెలిపాడు. ఇంతకుముందు ఇండియాకు రెండుసార్లు వచ్చాను. కానీ జట్టులో ఆడే అవకాశం రాలేదు. 8 టెస్ట్ మ్యాచ్ లలో కూడా డ్రింక్స్ బాయ్ గానే ఉన్నాను. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవాలని అనుకోలేదు. వికెట్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఆడాలని ముందే అనుకున్నాను. అందుకే ఈ సెంచరీ వెరీ స్పెషల్. ఇది మానసికయుద్ధం.. ఇక్కడ ఆటే ప్రధానం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: